Director Hari: మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా దర్శకుడు హరికి మంచి పేరు ఉంది. హీరో సూర్యతో ఆయన తీసిన ‘సింగం’ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సిరిస్ కి తెలుగులో కూడా బాగా ఆకట్టుకుంది. అయితే, హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలనీ వుంది. ఆ మధ్య బాలయ్య బాబుతో హరి సినిమా ఫిక్స్ అయ్యింది అని రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ కి తగ్గట్టుగానే హరి కూడా బాలయ్య కోసం చాలా ప్రయత్నాలు చేశాడు.

కానీ.. హరి చెప్పిన కథ బాలయ్యకి నచ్చలేదు. దాంతో హరి – బాలయ్య కలయికలో సినిమా స్టార్ట్ కాలేదు. ఇప్పట్లో హరి డైరెక్ట్ తెలుగు సినిమా చెయ్యడు అనే టాక్ కూడా బాగా ప్రచారం జరిగింది. అయితే.. ఎట్టకేలకు హరి తెలుగు సినిమా పట్టాలెక్కబోతుంది. హీరో రానా – దర్శకుడు హరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ఈ కథ బాలయ్యకి చెప్పారు హరి హరి.
Also Read: Ram Pothineni: హీరో రామ్ బాలనటుడిగా నటించిన సినిమా ఏమిటో తెలుసా?
బాలయ్యకి ఈ కథ నచ్చలేదు. ఆ తర్వాత హరి.. బన్నీకి కథ వినిపించాడు. విచిత్రంగా కథ బన్నీకి బాగా నచ్చింది. కానీ.. డేట్లు ఇవ్వలేని పరిస్థితి. కారణం.. బన్నీ సినిమాల లైనప్ చాలా పెద్దగా వుంది. బన్నీ డేట్స్ రావడానికి మూడేళ్ళు సమయం పడుతుంది. ఇదే విషయాన్ని హరికి చెప్పారు బన్నీ. అయితే హరి వెంటనే తెలుగు సినిమా చేయాలని వుందని.. మరో హీరోతో ఈ సినిమా చేస్తాను. మనం మళ్లీ మరో సినిమా కలిసి చేద్దాం’ అంటూ పక్కకి వచ్చాడు హరి.

అలా పక్కకి వచ్చిన హరి వెంటనే ఈ కథని రానాకి చెప్పారు. రానాకి కథ నచ్చింది. కాంబినేషన్ ఫైనల్ అయ్యింది. రానాకి మాస్ ఇమేజ్ వుంది. ఈ కథ రానా ఇమేజ్ కి కూడా పక్కాగా సరిపొతుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన అధికారిక ప్రకటన రానుంది.
దర్శకుడు హరి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ;మా కాంబినేషన్ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఐతే, మా సినిమా ఆలస్యమైనా, పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా చేస్తాం. ఈ సినిమాలోని పాటల గురించీ, మాటల గురించీ మాట్లాడుకుంటూనే ఉంటారు. రానా క్రేజ్ రెట్టింపు అవుతుంది. ఆ స్థాయిలో మా సినిమా ఉంటుంది’ అంటూ హరి చెప్పుకొచ్చాడు.
Also Read:Raashi Khanna: రాశీ ఖన్నా రొమాంటిక్ పిక్స్.. బాబోయ్ మరీ ఇంతగానా ?
[…] Also Read: Director Hari: తెలుగు సినిమా చేస్తోన్న తమిళ స్… […]
[…] Also Read: Director Hari: తెలుగు సినిమా చేస్తోన్న తమిళ స్… […]