https://oktelugu.com/

Tamil Heroes: ఆ విషయం లో మన హీరోలకి ఉన్న ఫ్రీడం తమిళ్ హీరోలకు లేదా..?

మన తెలుగు నుంచి వచ్చే సినిమాలు భారీ స్కేల్ లో వస్తున్నాయి. అందువల్లే సూపర్ సక్సెస్ ని కొడుతూ పాన్ ఇండియా లో తన సత్తా చాటుతున్నాయి. ఇక ఈ విషయంలో మనకున్నంత అడ్వాంటేజ్ తమిళ ఇండస్ట్రీకి లేదనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : March 12, 2024 / 03:34 PM IST

    Tamil Heroes

    Follow us on

    Tamil Heroes: ఇక మన హీరోలు ప్రస్తుతం ఏ సినిమా చేసినా కూడా పాన్ ఇండియాలో భారీ బిజినెస్ అయితే జరుపుకుంటున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఇక్కడి హీరోలు చేసే సినిమాలు ఇండియాని శాసిస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందువల్లే ప్రతి దర్శకుడు మన హీరోలను టార్గెట్ చేస్తూ కథలను రాసుకుంటూ మన హీరోలతోనే సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే ఒక విషయంలో మన హీరోలకి ఉన్న ఫ్రీడమ్ అయితే తమిళ్ సినిమా హీరోలకు లేదనే చెప్పాలి. అది ఎంటి అంటే తమిళ్ ఇండస్ట్రీలో వాళ్లు డిఫరెంట్ అటెంప్ట్ లు చేస్తూ సినిమాలు చేస్తున్నారు. కానీ అవి చిన్న సినిమాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కానీ పెద్ద బడ్జెట్ లో సినిమాలు చేస్తే మాత్రం వాళ్ల సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి. కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమాలు రియలేస్టిక్ గా ఉండే సినిమాలు కావడం ఇక చిన్నపాయింట్ ని పట్టుకొని ముందుకెళ్లే సినిమాలు కాబట్టి వాటితో పాన్ ఇండియా లో భారీ సక్సెస్ కొట్టాలి అంటే చాలా కష్టం అవుతుంది.

    కాబట్టి మన తెలుగు నుంచి వచ్చే సినిమాలు భారీ స్కేల్ లో వస్తున్నాయి. అందువల్లే సూపర్ సక్సెస్ ని కొడుతూ పాన్ ఇండియా లో తన సత్తా చాటుతున్నాయి. ఇక ఈ విషయంలో మనకున్నంత అడ్వాంటేజ్ తమిళ ఇండస్ట్రీకి లేదనే చెప్పాలి…ఇక అక్కడ ఒకరిద్దరు దర్శకులను మినహియిస్తే పాన్ ఇండియాలో సినిమాలని హ్యాండిల్ చేసే దర్శకులు పెద్దగా లేరనే చెప్పాలి. అందుకే ఆ హీరోలు ఎక్కువగా మన తెలుగు డైరెక్టర్ లతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక దానివల్లే మన దర్శకులు కొందరు తమిళ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

    అలాగే మన హీరోలతో తమిళ్ డైరెక్టర్లు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ, అక్కడున్న దర్శకులు పాన్ ఇండియా సినిమాలో పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ ని తీసుకొచ్చి సినిమాలను హిట్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్లతో మనవాళ్లు సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు…