Hero Vijay Dance
Hero Vijay Dance: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్నంత పాన్ ఇండియన్ రీచ్ ఏ స్టార్ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం తో ఆయన మేనియా బోర్డర్స్ ని దాటేసింది. ఇతర భాషల్లో డబ్ కాకపోయినా కూడా ఈ సినిమాకి ఫ్యాన్స్ భారీ గా ఉన్నారు. ఈ చిత్రానికి ఆ రేంజ్ రీచ్ రావడానికి ప్రధాన కారణాలలో సాంగ్స్ కూడా ఒకటి.
తమన్ అందించిన సాంగ్స్ విడుదలకు ముందే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక విడుదల తర్వాత అయితే పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ కి అయితే టాలీవుడ్ సెలెబ్రిటీలు నుండి స్టార్ క్రికెటర్స్ వరకు ప్రతీ ఒక్కరు డ్యాన్స్ వేశారు. ఇప్పటికీ ఈ పాట ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా సిర్క్యులేట్ అవుతూనే ఉంది.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ పాటకి తమిళ నాడు ప్రస్తుతం నెంబర్ 1 స్టార్ హీరో గా కొనసాగుతున్న విజయ్ కూడా డ్యాన్స్ వేసాడు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన ‘బీస్ట్’ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలై యావరేజి ఫలితం ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో బ్రేక్ టైం లో విజయ్ , పూజ హెగ్డే తో కలిసి సరదాగా బుట్టబొమ్మ సాంగ్ కి డ్యాన్స్ వెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత బయటపడ్డ ఈ వీడియో కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సౌత్ ఇండియా లో అతి పెద్ద సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ లాంటి స్టార్ అల్లు అర్జున్ పాటకి డ్యాన్స్ వెయ్యడం విశేషం, దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా సొంతోషిస్తున్నారు.
BUTTABOMMA Step!!! ❤️
Great to see Thalapathy @actorvijay garu dancing for @alluarjun‘s song pic.twitter.com/gfIVfhPlgU
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) June 23, 2023