Hero Ajith: ఈమధ్య కాలంలో మన టాలీవుడ్ నిర్మాతలు ఇతర భాషల్లో సినిమాలు తీయడం సర్వ సాధారణం అయిపోయింది. అప్పట్లో మన నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ లో గజినీ చిత్రం చేశాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమా గా నిల్చింది ఆ చిత్రం. ఆ తర్వాత పెద్దగా మన టాలీవుడ్ నుండి నిర్మాతలు ఇతర భాషల్లో సినిమాలు చెయ్యలేదు. ఈమధ్య కాలంలో మళ్ళీ మొదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుగా ఒక ప్రయత్నం చేశాడు. తమిళ హీరో విజయ్ తో కలిసి ఆయన ‘వారిసు’ అనే చిత్రం చేశాడు. పెద్ద హిట్ అయ్యింది, ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ అజిత్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో ‘జాట్’ వంటి చిత్రాలు చేసి భారీ విజయాలను అందుకున్నారు.
సెంట్ గానే ఈ బ్యానర్ నుండి విడుదలైన ‘డ్యూడ్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరం చూశాం. ఇలా మన నిర్మాతలు ఇతర భాషల్లో వరుసగా సినిమాలు చేసి హిట్ అవుతుందడం చూసి ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర కి కూడా ఒక సినిమా ఇతర భాషలో చెయ్యాలనే కోరిక పుట్టింది. అందులో భాగం గా రీసెంట్ గానే ఆయన తమిళ స్టార్ హీరో అజిత్ ని కలిశారు. గతం లో అజిత్ కి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన అద్విక్ ఈ చిత్రానికి కూడా దర్శకుడు. రీసెంట్ గానే స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. అజిత్ కి కథ బాగా నచ్చింది. కానీ ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి నిర్మాత అనిల్ సుంకర కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఏకంగా 165 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశాదట.
అజిత్ కి ఇప్పటి వరకు కనీసం 250 కోట్ల గ్రాస్ సినిమా కూడా లేదు. ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి కేవలం 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి అజిత్, ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాపం అనిల్ సుంకర కి నోటి నుండి మాట రాలేదట. దీంతో ప్రస్తుతానికి ఈ చిత్రం హోల్డ్ లో పడింది. మన టాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్ లో భారీ మార్కెట్ సొంతం చేసుకున్న హీరోలు కూడా ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లేదు. అలాంటిది అజిత్ అంతా రెమ్యూనరేషన్ ఎలా డిమాండ్ చేస్తాడు అంటూ సోషల్ మీడియా లో నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.