https://oktelugu.com/

Actor Poo Ramu Passes Away: విషాదం : లెజెండరీ నటుడు మృతి.. సూర్య కంట కన్నీళ్లు

Actor Poo Ramu Passes Away: సౌత్ చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ సీనియ‌ర్ నటుడు రామురోజ్ గుండెపోటుతో చనిపోయారు. ఆయన గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్ర‌వారం గుండెపోటు వచ్చింది. వెంటనే.. చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిట‌ల్‌ కి కుటుంబ స‌భ్యులు రామురోజ్ ను తరలించారు. అప్ప‌టి నుండి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారు. మొదట్లో రామురోజ్ ఆరోగ్యం కుదుట పడింది. అయితే, పెరిగిన వయసు ప్రభావంతో […]

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2022 / 01:10 PM IST
    Follow us on

    Actor Poo Ramu Passes Away: సౌత్ చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ సీనియ‌ర్ నటుడు రామురోజ్ గుండెపోటుతో చనిపోయారు. ఆయన గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్ర‌వారం గుండెపోటు వచ్చింది. వెంటనే.. చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిట‌ల్‌ కి కుటుంబ స‌భ్యులు రామురోజ్ ను తరలించారు.

    Actor Poo Ramu

    అప్ప‌టి నుండి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారు. మొదట్లో రామురోజ్ ఆరోగ్యం కుదుట పడింది. అయితే, పెరిగిన వయసు ప్రభావంతో ఆయన పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. దాంతో రామురోజ్ సోమ‌వారం తుదిశ్వాస విడిచాడు. ఎప్పటి నుంచో రామురోజ్ సినిమాల్లో ఉన్నా.. 2008లో వ‌చ్చిన ‘పూ’ సినిమాతో రామురోజ్‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది.

    Also Read: Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ కి ఆ గతి పట్టడానికి కారణం త్రివిక్రమా??

    అందుకే ఈయ‌న‌కు ‘పూ’ రాము అని మరో పేరు వచ్చింది. రామురోజ్ ‘నీర్‌ప‌రవై’, ‘ప‌రియేరుమ్ పెరుమాల్’, ‘నీడునాల్‌వాడై’, ‘సూరరై పొట్రూ’ వంటి సినిమాలో విభిన్నమైన పాత్రలను పోషించి.. గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సూర్య సినిమా ‘ఆకాశం నీ హ‌ద్దురా’ ‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా రామురోజ్ దగ్గర అయ్యారు. ముఖ్యంగా హీరో సూర్యకి ఆయన అంటే బాగా ఇష్టం. అందుకే.. రామురోజ్ చనిపోయాడని తెలియగానే సూర్య కంట కన్నీళ్లు వచ్చాయి.

    Actor Poo Ramu

    రామురోజ్ తుదిశ్వాస విడవడంతో ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. రామురోజ్ మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున రామురోజ్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

    Also Read:Pakka Commercial First Full Review: ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

    Tags