Homeఎంటర్టైన్మెంట్Actor Ajith: అభిమానులకు, మీడియా మిత్రులకు హీరో అజిత్ విజ్ఞప్తి...

Actor Ajith: అభిమానులకు, మీడియా మిత్రులకు హీరో అజిత్ విజ్ఞప్తి…

Actor Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో అనే హోదాను మర్చిపోయి మాములు మనిషిగా ప్రజలలో కలిసిపోతుంటారు అజిత్. అందుకే దక్షిణాది చిత్రపరిశ్రమలో అజిత్‏కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన నటనతో కేవలం తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా అజిత్‏కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో వరుస సక్సెస్ లను అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నాడు అజిత్. కాగా ఆయనను అభిమానుల అందరూ “తల” అని పిలుస్తారు. ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన ధీన చిత్రం అజిత్‏ను మాస్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాలోని అజిత్ పాత్ర పేరుతో ఆయన అభిమానులు తల అని పిలవడం ప్రారంభించారు.

tamil actor ajith request to media and fans as don't call him as thala

అయితే ఇప్పుడు తాజాగా అజిత్ ఇకపై తనను తల అని పిలవద్దంటూ అభిమానులకు, మీడియా కు విజ్ఞప్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఆ పోస్ట్ లో “గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజానీకానికి, అభిమానులకు. నన్ను ఇక నుంచి అజిత్, అజిత్ కుమార్ లేదా జస్ట్ ఎకె అని పిలవండి. కానీ తల లేదా మరేదైనా పేర్లతో నన్ను పిలవకండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రేమతో మీ అజిత్” అంటూ రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం అజిత్ హెచ్ వినోద్ దర్శకత్వంలో వాలిమై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. బోనీ కపూర్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా… హ్యూమా ఖురేషి, యోగి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular