Homeఎంటర్టైన్మెంట్Actress Tamannah: మెగాస్టార్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన తమన్నా... అధికారికంగా ప్రకటన ఇచ్చిన మూవీ...

Actress Tamannah: మెగాస్టార్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన తమన్నా… అధికారికంగా ప్రకటన ఇచ్చిన మూవీ యూనిట్

Actress Tamannah: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి లో మంచి గుర్తింపు దక్కించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి వచ్చి 15 సమత్సరాలు గడుస్తున్నా యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూనే ఉంది తమన్నా. ఒక వైపు వెండితెరపై సత్తా చాటుతూనే… మరోవైపు బుల్లితెరపై కూడా హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇటీవల సిటీమార్, మాస్ట్రో సినిమాలలో ప్రేక్షకులను అలరించింది తమన్నా. మ్యాస్ట్రోలో మొదటి సారి విలన్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది. అయితే తాజాగా చిరంజీవి సరసన మళ్ళీ నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. చిరు – మెహర్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి ఓ అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది.

tamannah officially confired as female lead in bhola shankar movie

మొదటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నానే నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. అలానే ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించనున్నట్టు చిత్ర యూనిట్ అధికారిక అప్డేట్ ఇచ్చారు. గతంలో చిరంజీవి, తమన్నా కలిసి సైరా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ముహూర్తం వచ్చే 11న ఉదయం 7 గంటల 45 నిమిషాలకు చేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కీర్తీ సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తుండగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో తమన్నా అభిమానుల్లో సందడి నెలకొంది. ఇటీవల మాస్ట్రో, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులను అలరింకింది ఈ మిల్కీ బ్యూటీ.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version