ఈ క్రమంలోనే తమన్నా తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాని, ప్రతి సిరీస్ ను కాదనడం లేదు. అందుకే ఈ మధ్య మూడు వెబ్ సిరీస్ లు ఒప్పుకుంది. తాజాగా మరో వెబ్ సినిమాకి కూడా సైన్ చేసింది, ఈ రోజు షూటింగ్ లో కూడా పాల్గొంది. “ప్లాన్ ఏ ప్లాన్ బి” అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
పైగా ఈ సినిమా హిందీలో మాత్రమే తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి దర్శకుడు శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించబోతున్నాడు. పైగా ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ జెనీలియా భర్త హీరో రితేష్ దేశముఖ్ తమన్నాకి జోడీగా నటిస్తున్నాడు. నిజానికి రితేష్ దేశముఖ్ కి హీరోగా ప్రస్తుతం మార్కెట్ లేదు.
మరి అలాంటి హీరో పక్కన కూడా తమన్నా ఎందుకు హీరోయిన్ గా నటిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా టార్గెట్ ప్రస్తుతం ఒక్కటే. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే మరో రెండేళ్లలో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకుంటుంది.
అందుకే ఈ లోపే ఎక్కువ సినిమాలు చేయాలని ఆశ పడుతుంది, అలాగే సాధ్యమైనంత వరకు ఎక్కువ సంపాదించాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఈ హిందీ వెబ్ సినిమా వర్కింగ్ స్టిల్ ని తమన్నా తాజాగా షేర్ చేసింది. ఈ స్టిల్ లో జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ కూడా ఉన్నాడు.