Tamannaah : సౌత్ ఇండియాలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. తెలుగు, తమిళం భాషల్లో ఈమె సీనియర్ హీరోల దగ్గర నుండి, నేటి తరం స్టార్ హీరోల వరకు అందరినీ కవర్ చేసింది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ఇలా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఒకరిద్దరు హీరోయిన్స్ లో ఈమె ఒకటి. కాస్త క్రేజ్ రాగానే ఈమె బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈమె ఓటీటీ లో అడల్ట్ రేటెడ్ కంటెంట్ సినిమాల్లో నటించడానికి కూడా వెనుకాడలేదు. సౌత్ మూవీస్ లో కనీసం ముద్దు సన్నివేశాల్లో నటించడానికి కూడా ఆసక్తి చూపించని తమన్నా, బాలీవుడ్ లో మాత్రం ఏకంగా అడల్ట్ రేటెడ్ సన్నివేశాలు చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలంగా ఈమె విజయ్ వర్మ అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. విజయ్ వర్మ మన తెలుగు ఆడియన్స్ కి నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన MCA చిత్రంతో విలన్ గా పరిచయమయ్యాడు. ఎక్కువ శాతం ఆయన బాలీవుడ్ లోనే సినిమాలు చేసాడు. తమన్నా తో కలిసి కేవలం ఆయన ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే చిత్రంలో మాత్రమే నటించాడు. ఈ సినిమాలో తమన్నా తో కలిసి ఆయన చేసిన ఘాటు రొమాన్స్ బాలీవుడ్ లోనే సంచలన టాపిక్ గా మారింది. రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండే మీరు అకస్మాత్తుగా ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నారేంటి అని విలేఖరులు అడగగా, విజయ్ వర్మ నా కాబోయే భర్త, అతనితో కాబట్టే అలాంటి ఘాటు రొమాన్స్ సన్నివేశాల్లో నటించాను అంటూ కవర్ చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా వీళ్లిద్దరి బ్రేకప్ చేసుకున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా తమన్నా పెట్టిన ఒక పోస్ట్ చూసిన తర్వాత ఆమె అభిమానులు ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఇంతకు ఆమె ఏమని చెప్పిందంటే ‘ ప్రేమని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు, ఎదురు వ్యక్తులకు సీక్రెట్ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఒకరు మిమ్మల్ని అందంగా చూడాలంటె, ముందు మీ చుట్టూ ఉన్నవాళ్లను అందంగా చూడడం నేర్చుకోండి’ అంటూ ఆమె ఒక క్వాట్ ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది. దీనిని చూసి ఆమె అభిమానులు ఇది తమన్నా తన మనసుకి దగ్గరైన వాళ్లకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ పెట్టినట్టుగా ఉంది. కచ్చితంగా విజయ్ వర్మ కే ఆమె కౌంటర్ ఇస్తుందా?, వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయా అని అనుమానిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.