https://oktelugu.com/

Photo Story: పాల బుగ్గల ఈ పసిపాప.. ఇప్పుడు పాలమీగడ లాంటి అందమైన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి

టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీ అనగానే గుర్తుకు వస్తుంది పాల బుగ్గల తమన్నా అని. అవును ఈమె తమన్నానే. చిన్నప్పుడు ఎంతో అందంగా ఉన్న తమన్నా పెరిగి పెద్దయ్యాక కూడా బ్యూటీనెస్ తో ఆకట్టుకుంటోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2023 / 12:18 PM IST
    Follow us on

    Photo Story: సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రెటీలు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో తమ లేటేస్ట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ అలరిస్తుంటారు. ఇదే సమయంలో చిన్న నాటి పిక్స్ ను కూడా షేర్ చేస్తున్నారు. అప్పటికే మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ పాలోయింగ్ తెచ్చుకున్న సెలబ్రేటీలు వారి లైక్స్ తో చైల్డ్ హుడ్ ఫొటోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఓ బ్యూటీకి సంబంధించిన చిన్న నాటి పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా ఉన్న బేబీ పెరిగి పెద్దయ్యాక స్టార్ అయ్యి అగ్రహీరోలతో నటించింది. అంతేకాకుండా ఓ డైరెక్టర్ తో రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఏవరా బ్యూటీ?

    టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీ అనగానే గుర్తుకు వస్తుంది పాల బుగ్గల తమన్నా అని. అవును ఈమె తమన్నానే. చిన్నప్పుడు ఎంతో అందంగా ఉన్న తమన్నా పెరిగి పెద్దయ్యాక కూడా బ్యూటీనెస్ తో ఆకట్టుకుంటోంది. పాల మీగడలాంటి అందంతో యూత్ ను ఆకట్టుకుంటోంది. కొన్నేళ్లుగా తమన్నా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అలరిస్తోంది. తమిళ, తెలుగు సినిమాల్లో బిజీ అయిన ఈ భామ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

    1989 డిసెంబర్ 21న ముంబయ్ లో జన్మించిన తమన్నా హిందీ చిత్రం ‘చాంద్ సా రోషన్ చెహ్ర’తో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హిందీలో అవకాశాలు రాలేదు. 2005లో తెలుగులో ‘శ్రీ’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తరువాత శేఖర్ కమ్ముల తీసిన ‘హ్యాపీడేస్’ సినిమాలో తమన్నా మెరిసింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ మిల్క్ బ్యూటీకి అవకాశాలు పెరిగాయి. సుకుమార్ ఈమెకు 100 పర్సంట్ లవ్ సినిమాలో చాన్స్ ఇచ్చారు. ఈ మూవీ బంపర్ హిట్టు కొట్టడంతో తమన్నా స్టార్ అయింది.

    అక్కడి నుంచి తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అల్లుఅర్జున్, మహేష్ బాబు లతో పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనూ నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ బిజీ అయిన ఈ భామ డైరెక్టర్ విజయ్ వర్మతో రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని తమన్నా బయటపెట్టలేదు. ఇక తాజాగా తమన్నా పార్లమెంట్ కొత్త భవనంలో సందడి చేసింది. ఇటీవల మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కొందరు ప్రముఖులను ప్రధాని ఆహ్వానించారు. వీరిలో తమన్నా కూడా ఉండడం విశేషం.