Tamanna Super Hit Movies: సౌత్ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్టీబ్యాక్ సినిమాలు చేసి చక్రం తిప్పిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇప్పుడు స్పెషల్ పాటలతో సినిమాలలో సందడి చేస్తుంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తుంది. ఇప్పుడు ఈమె పాన్ ఇండియా హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, హిందీ భాషలలో 20 సంవత్సరాల నుంచి అనేక హిట్ సినిమాలలో నటించింది. ఇప్పటికీ కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ హీరోయిన్ వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు ఓకే చెప్పి క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుంది. గత కొన్ని రోజుల నుంచి ప్రేమ, బ్రేకప్ వంటి వార్తలతో చర్చల్లో నిలిచింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది.
రీసెంట్ గా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఒక సినిమాతో ఈ బ్యూటీ రీసెంట్గా బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తాన్ని బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై పెట్టింది మిల్కీ బ్యూటీ తమన్న. ఎస్ ఏ దర్శకత్వం చేసిన కేడి అనే సినిమాతో తమన్నా తమిళ సినిమా ఇండస్ట్రీలో తన సినిమా కెరియర్ ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ్తోపాటు తెలుగులో, హిందీలో కూడా అనేక హిట్ సినిమాలలో నటించింది. గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కూడా జోడిగా నటించి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంది.
గత ఏడాది ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన హిట్ సినిమాలు జైలర్, అరుణ్నై 4. జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా రూ.650 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక అరున్మ నై 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈమె చేతిలో ఇప్పుడు తెలుగు మరియు తమిళ్ సినిమాలు ఒకటి కూడా లేదు.ప్రస్తుతం తమన్నా కేవలం హిందీ సినిమాలలో మాత్రమే నటిస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram