Takkar Collections: యూత్ ఫుల్ సినిమాలు తీస్తూ ఒకప్పుడు యూత్ ఐకాన్ గా మారిన హీరో సిద్దార్థ్. ‘బొమ్మరిల్లు’ మరియు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలు ఆరోజుల్లో ఒక సెన్సేషన్ ని సృష్టించాయి. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో సిద్దార్థ్ కి ఒక స్టార్ హీరో రేంజ్ ఇమేజి ని తెచ్చిపెట్టింది.ఆ తర్వాత చేసిన ‘ఆట’, ‘ఓయ్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’,’ఓ మై ఫ్రెండ్’ వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి కానీ, ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ అయితే కాదు.
కానీ సిద్దార్థ్ ఒక్క చోట కుదురుగా ఉండకపోవడం వల్లే, ఆయన క్రేజ్ మొత్తం దెబ్బతినింది అని విశ్లేషకులు అంటుంటారు. తెలుగు తర్వాత తమిళం , హిందీ ఇలా అన్నీ బాషలలో అడుగుపెట్టి అక్కడ సూపర్ హిట్స్ ని అందుకున్నాడు కానీ స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆయన చాలా కాలం తర్వాత ‘టక్కర్’ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు.
ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ లైన్ బాగున్నప్పటికీ సరైన టేకింగ్ లేకపోవడం వల్ల ఈ చిత్రానికి అలాంటి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. కానీ చాలా కాలం తర్వాత సిద్దార్థ్ నుండి వస్తున్న కావడం తో ఓపెనింగ్స్ చాలా డీసెంట్ గా వచ్చాయి. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు లో 70 లక్షల రూపాయిల గ్రాస్ మరియు 35 లక్షల రూపాయిల షేర్ వచ్చింది. ఇక రెండవ రోజు అయితే 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, మూడవ రోజు 20 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.
అలా మూడు రోజులకు కలిపి 80 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో కోటి 70 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టాలి. సరైన బజ్ లేకపోతే సున్నా షేర్స్ వస్తున్న ఈ రోజుల్లో ఈ మాత్రం వసూళ్లు రావడం గొప్పే అని చెప్పొచ్చు. ఆడియన్స్ ఇంకా సిద్దార్థ్ సినిమాలను చూడడానికి సిద్ధంగా ఉన్నారు, అలాంటప్పుడు ఆయన మంచి ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవాలి, ఇలాంటి చెత్త సినిమాలు చేసేపని అయితే సినిమాలు చెయ్యడం మానేసుకోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.