Tabu filmography highlights: కొంతమంది నటీమణులు దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఈ నటీమణులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. కొన్ని శతాబ్దాల నుంచి కూడా చెరగని ముద్ర వేసుకుంటూ ఇప్పటికీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఓ నటి బాలీవుడ్, దక్షిణ చిత్ర పరిశ్రమలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుంది. అనేక మంది సూపర్ స్టార్లతో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నటి ఒకే హీరోకి తల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా పాత్రలు పోషించింది.
మనం మాట్లాడుతున్న నటి మరెవరో కాదు టబు. ఎన్నో దశాబ్దాలుగా అద్భుతమైన కెరీర్‌తో, టబు బాలీవుడ్, దక్షిణ సినీ ఇండస్ట్రీలో అనేక సూపర్-డూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఆమె OTT ప్లాట్‌ఫామ్‌లో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ బ్మూటీ తన 11 సంవత్సరాల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె మొదటి చిత్రం బజార్. ఈ సినిమా 1982లో విడుదలైంది. తరువాత ఆమె 14 సంవత్సరాల వయసులో బాలనటిగా తన రెండవ చిత్రంలో కనిపించింది. హిందీ, తమిళ సినిమాలతో పాటు, టబు తెలుగు చిత్రాలలో కూడా పనిచేశారు. 199లో వచ్చిన కూలీ నెంబర్ వన్ లో ఈమె మొదటి సారిగా తెలుగులో నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ పాత్ర ఆమె బాలీవుడ్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడింది.
టబు ‘ ప్రేమ్’ సినిమాతో
సంజయ్ కపూర్ నటించిన ప్రేమ్ సినిమాలో నటించి టబు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే, నిర్మాణ జాప్యాల కారణంగా 1994లో ఆమె తొలి సినిమా ‘పెహ్లా పెహ్లా ప్యార్’ గా వచ్చింది. అదే సంవత్సరం, ఆమె అజయ్ దేవగన్ తో కలిసి ‘విజయ్ పథ్’ లో నటించింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను అందుకుంది. అజయ్ దేవగన్ తో టబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. వ్యక్తిగత జీవితంలో కూడా ఇద్దరూ మంచి స్నేహితులు.
ఒకే హీరో స్నేహితురాలు, భార్య, తల్లి పాత్రలు
టబు కెరీర్‌లో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆమె ఒకే నటుడు – తెలుగు సినిమా సూపర్‌స్టార్ నందమూరి బాలకృష్ణతో మూడు విభిన్న పాత్రలను పోషించింది. టబు – బాలకృష్ణ అనేక ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు. వాటిలో వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి (2002) కూడా ఒకటి. దీనిలో ఆమె నటుడి తల్లి, భార్యగా ద్విపాత్రాభినయం చేసింది. అలాగే, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పాండురంగడు (2008) జీవిత చరిత్ర చిత్రం లో టబు బాలకృష్ణ స్నేహితురాలిగా నటించింది.
ఇక కొన్ని సంవత్సరాలుగా, టబు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, మోహన్‌లాల్, అజిత్ వంటి సూపర్‌స్టార్‌లతో కలిసి పనిచేశారు. నేడు ఆమె భారతీయ సినిమా అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరిగా ఎదిగారు.