Taare Zameen Par Child Actor: అమీర్ ఖాన్(Amir Khan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen par) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. ఈ తరహా సినిమాలు థియేటర్స్ లో ఆడడం కష్టమే అనే ఐడియా అందరికీ ఉంది. కానీ అమీర్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి గంటకు పాతిక వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం 2007 వ సంవత్సరం లో విడుదలైన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు అమీర్ ఖానే దర్సకత్వం వహించాడు. ఆ రోజుల్లో ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది.
ఈ చిత్రం ఇషాంత్ అవస్థి అనే చిన్న పిల్లాడి క్యారక్టర్ చుట్టూ తిరుగుతుంది. కథ ఏమిటంటే చదువు లో పూర్ గా ఉండే ఇషాంత్ ని అతని తల్లితండ్రులు ఎప్పుడూ తిడుతూ ఉంటారు. కానీ ఇషాంత్ కి బాగా చదువుకోవాలి అనే కోరిక ఉంటుంది. కానీ డైస్లెక్సియా అనే వ్యాధి కారణంగా చదువుకోలేకపోతాడు. ఈ వ్యాధి ఉన్నోళ్లు ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలను అర్థం చేసుకోలేరు. విద్యని అభ్యసించలేరు. తనకి ఇష్టమైన చదువుని పొందే అదృష్టం లేదని ఇషాంత్ తనలో తానూ కుమిలిపోతూ ఉంటాడు. దీనిని ఇషాంత్ టీచర్ రామ్ గమనిస్తాడు. అతని సమస్య ని తీర్చేందుకు తనవంతు సహాయం అందించి కుర్రాడిని మెరిట్ స్టూడెంట్ లాగా అతని తల్లితండ్రులకు అప్పగిస్తాడు. కథ వింటుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదూ, సినిమా కూడా మంచి ఎమోషన్స్ తో అంతే అద్భుతంగా ఉంటుంది.
Also Read: OKtelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !
ఇందులో ఇషాంత్ అవసతి క్యారక్టర్ చేసిన కుర్రాడి పేరు దర్శల్ సఫారీ(Darsheel Safary). ఇతని వయస్సు ప్రస్తుతం 28 ఏళ్ళు. చిన్నతనం లో తొర్రిపళ్లతో ఏమి తెలియని అమాయకుడిలాగా కనిపించిన ఈ బుడ్డోడు, ఇప్పుడు ఎంత పెద్దోడు అయ్యాడో మీరే చూడండి. అదిరిపోయే లుక్స్ తో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇతను బాల్యం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. పెద్దయ్యాక ‘కుచ్ ఎక్స్ ప్రెస్’,’హుకుస్ బుకూస్’,’ఫూలే’ వంటి చిత్రాలు చేసాడు. కానీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. బాలనటుడిగా ఇతను ఒక స్టార్. చిన్న తనం లోనే ‘జోకో మ్యాన్’ వంటి సూపర్ హీరో చిత్రంలో కూడా లీడ్ రోల్ చేసాడు. కానీ పెద్దయ్యాక మాత్రం ఒక్కటి కూడా కలిసిరావడం లేదు. రాబోయే రోజుల్లో అయినా ఇతని జాతకం మారుతుందో లేదో చూడాలి.