https://oktelugu.com/

పెళ్లి చేసుకోలేదు.. డేటింగ్ మాత్రమే చేస్తున్నా !

ఒకప్పుడు హీరోయిన్లు తమ భర్తలను పరిచయం చేయడానికి కూడా ఆలోచిస్తుంటారు. కానీ, ఇప్పటి హీరోయిన్లు తమ ప్రియుడి గురించి అడగకుండానే మీడియా ముందు డైరెక్ట్ గా చెబుతున్నారు. అయితే ఈ కరోనా కాలంలో లవ్ లో ఉన్న హీరోలు, హీరోయిన్లు అందరూ పెళ్లిపీటలెక్కుతూ సోలో లైఫ్ కి శుభం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే రానా తన గాళ్ ఫ్రెండ్ మిహీకని, నితిన్ తన లవర్ శాలినిని, నిఖిల్ సిద్దార్థ్ పల్లవి వర్మని, కాజల్ అగర్వాల్ తన బాయ్ […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 04:24 PM IST
    Follow us on


    ఒకప్పుడు హీరోయిన్లు తమ భర్తలను పరిచయం చేయడానికి కూడా ఆలోచిస్తుంటారు. కానీ, ఇప్పటి హీరోయిన్లు తమ ప్రియుడి గురించి అడగకుండానే మీడియా ముందు డైరెక్ట్ గా చెబుతున్నారు. అయితే ఈ కరోనా కాలంలో లవ్ లో ఉన్న హీరోలు, హీరోయిన్లు అందరూ పెళ్లిపీటలెక్కుతూ సోలో లైఫ్ కి శుభం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే రానా తన గాళ్ ఫ్రెండ్ మిహీకని, నితిన్ తన లవర్ శాలినిని, నిఖిల్ సిద్దార్థ్ పల్లవి వర్మని, కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ని పెళ్లాడి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

    Also Read: శృతి హాసన్ అప్పటినుండే మందు ముట్టలేదు !

    అలాగే నిహారిక పెళ్లి ఈ నెల 9న, ఇక సింగర్ సునీత ఈ నెలాఖర్లో రెండ్ పెళ్లి చేసుకోనుంది. మొత్తానికి సెలబ్రిటీలందరూ ఇలా కరోనా కారణంగా పెళ్లి మూడ్లోకి రావడంతో సింగిల్ లైఫ్ కి ఎండింగ్ కార్డు వేసుకుంటూ పోతున్నారు. సింగిల్ గా ఉన్నవారిని మీడియా కూడా ఉండనివ్వడం లేదు. కనిపిస్తే చాలు.. పెళ్లి ఎప్పుడు అంటూ తెగ ఇబ్బంది పెడుతుంది. హీరోయిన్ తాప్సికి కూడా మీడియా నుండి ఇదే ప్రశ్న ఎదురైంది. తాప్సి గత కొంతకాలంగా లవ్ లో ఉంది. మథియాస్ అనే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో డేటింగ్ చేస్తూ.. ప్రేమలోని మధురానుభూతిని అనుభవిస్తూ.. అప్పుడప్పుడు కంగనా మీద విరుచుకుపడుతూ కాలాన్ని నెట్టుకొస్తోంది.

    Also Read: ‘కియారా అద్వానీ’ని పెళ్లి చేసుకుంటాడట !

    అయితే పెళ్లి విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు తాప్సి స్పందించింది. “పెళ్లి వార్తలు తప్పు. డేటింగ్ నిజం. అంతకన్నా ఏమి చెప్పను,” అని సూటిగా సుత్తిలేకుండా చెప్పుకుంటూ పోయింది. నిజానికి తాప్సి పై గతంలోనే కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఓ బిజినెస్ మెన్ తో ఆమె డేటింగ్ చేస్తోందని.. అలాగే ఆమెకు ఓ డైరెక్టర్ తో ఎఫైర్ కూడా ఉందని.. ఇలా చాలా రకాలుగా తాప్సి పై కథనాలు వచ్చాయి. కానీ తాప్సి మాత్రం ఎప్పుడూ దేని గురించి పట్టించుకోలేదు. కానీ తన ప్రియుడు గురించి మాత్రం బాహాటంగానే చెప్పింది. పైగా ఇటీవలే అతనితో కలిసి మాల్దీవుల్లో వెకేషన్ కి వెళ్ళొచ్చింది. అక్కడే వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందనే పుకారు కూడా బాగా వినిపిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్