https://oktelugu.com/

Taapsee Pannu Marriage: పెళ్లికి సిద్ధమైన తాప్సీ… వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

తన ప్రేమ విషయాన్ని తాప్సీ రహస్యంగా ఉంచింది. ఇటీవల ప్రియుడిని పరిచయం చేసింది. మాథియస్ బో(Mathias Boe) ఓ ఈవెంట్ కోసం ముంబై రాగా పరిచయం ఏర్పడిందట. అది కాస్తా ప్రేమకు దారి తీసిందట.

Written By: , Updated On : February 28, 2024 / 10:29 AM IST
Taapsee Pannu Mathias Boe to marry in March
Follow us on

Taapsee Pannu Marriage: హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్ళికి సిద్ధమైంది. ఆమె ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. మరి తాప్సీకి భర్తగా రానున్న ఆ లక్కీ ఫెలో ఎవరంటే… మాథియస్ బో. ఈయన డెన్మార్క్ కి చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు. మాథియస్ బో-తాప్సీ పన్ను దాదాపు పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. తన ప్రేమ విషయాన్ని తాప్సీ రహస్యంగా ఉంచింది. ఇటీవల ప్రియుడిని పరిచయం చేసింది. మాథియస్ బో(Mathias Boe) ఓ ఈవెంట్ కోసం ముంబై రాగా పరిచయం ఏర్పడిందట. అది కాస్తా ప్రేమకు దారి తీసిందట.

ఎట్టకేలకు తాప్సీ-మాథియస్ బో ఏడడుగుల బంధంలో అడుగుపెడుతున్నారు.2024 మార్చి నెలలో ఘనంగా వీరి వివాహం జరగనుందట. అందుకు ఏర్పాట్లు మొదలయ్యాయట. తాప్సి పన్ను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా విదేశీయులను పెళ్లాడే హీరోయిన్స్ లిస్ట్ అంతకంతకు పెరిగిపోతుంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది.

ఇక శ్రియా శరన్ రష్యాకు చెందిన ఆండ్రూ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక అమ్మాయి. ప్రీతి జింటా సైతం విదేశీయుడిని పెళ్లాడింది. వరుడి కోసం ఏకంగా హీరోయిన్స్ ఖండాంతరాలు దాటిపోతున్నారు. ఇక తాప్సీ కెరీర్ తెలుగులో మొదలైంది. దర్శకుడు కే రాఘవేంద్రరావు ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మంచు మనోజ్ హీరోగా నటించిన మ్యూజికల్ లవ్ డ్రామా ఝుమ్మంది నాదం ఆశించిన స్థాయిలో ఆడలేదు. వరుడు, వీర, షాడో ఇలా పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా తాప్సీ నటించింది. కొన్నాళ్లుగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తుంది. హిందీలో బిజీ అయ్యాక సౌత్ ఇండస్ట్రీ మీద ఆమె ఆరోపణలు చేయడం కొసమెరుపు.