Taapsee Pannu: తన ఫిజిక్ సీక్రెట్ చెప్పేసిన తాప్సీ పన్ను

Taapsee Pannu: తాప్సీ పన్ను చాలా ఫిట్ గా ఉంటుంది. అందాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ శారీరక శ్రమ చెయ్యాలి. కానీ.. తాప్సీ పన్ను అందం కోసం శారీరక శ్రమ చేయదు అట. ఆరోగ్యం కోసం మాత్రమే తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అని చెబుతుంది. ఆరోగ్యం బాగుంటే.. అందం కూడా పెరుగుతుంది అని.. ఇదే సూత్రాన్ని తాను పాటిస్తాను అంటూ తాప్సీ పన్ను చెబుతుంది. ఇంకా తాప్సీ పన్ను మాట్లాడుతూ..“ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చెయ్యాల్సిన అవసరం నాకు […]

Written By: Shiva, Updated On : May 4, 2022 4:25 pm
Follow us on

Taapsee Pannu: తాప్సీ పన్ను చాలా ఫిట్ గా ఉంటుంది. అందాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ శారీరక శ్రమ చెయ్యాలి. కానీ.. తాప్సీ పన్ను అందం కోసం శారీరక శ్రమ చేయదు అట. ఆరోగ్యం కోసం మాత్రమే తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అని చెబుతుంది. ఆరోగ్యం బాగుంటే.. అందం కూడా పెరుగుతుంది అని.. ఇదే సూత్రాన్ని తాను పాటిస్తాను అంటూ తాప్సీ పన్ను చెబుతుంది.

Taapsee Pannu

ఇంకా తాప్సీ పన్ను మాట్లాడుతూ..“ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. కానీ, క్రమం తప్పకుండా నేను ఏదో రకంగా శారీరక శ్రమ చేస్తాను. ఎప్పుడైనా కన్సిస్టెన్సీ ముఖ్యం. ఒక విధంగా అదే నా ఫిజిక్ సీక్రెట్. తప్పని పరిస్థితుల్లో తప్ప నేను ఎక్కువగా కృతిమ ఎక్సర్ సైజ్ లు చేయను అని చెప్పింది ఈ భామ.

Also Read: Rajamouli Sye Movie: రాజమౌళి ‘సై’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఈ అమ్మడు గతంలో వర్కవుట్ ల విషయంలో ఎప్పుడూ పెద్దగా సీరియస్ గా లేదు అట. కానీ, సినిమా ఇండస్ట్రీలో ఇతర నటీనటుల శ్రమపడే విధానాన్ని చూసి తాప్సీ పన్ను తన బాడీ పై ఫోకస్ పెట్టిందట. అయితే, ఏమి చేసినా సహజంగానే చేయాలని ఆమె ముందే ఒక నియమం పెట్టుకుందట.

Taapsee Pannu

మధ్యలో జిమ్మింగ్ ను కూడా తాప్సీ పన్ను బాగా అలవాటు చేసుకుంది. అయితే జిమ్మింగ్ ఎక్కువగా అలవాటు అయితే వదలం అని.. అందుకే.. అప్పటి నుంచి ఎక్కువ సేపు జిమ్ లో ఉండటం లేదు అని తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది. ఇక తాప్సీ తన వర్కౌట్ ఫోటోలను తన ఇన్‌ స్టా లో అభిమానులతో పంచుకుంది.

Taapsee Pannu

ఈ ఫోటోల్లో తాప్సీ పన్ను మరింత ముద్దుగా కనిపించడంతో.. విపరీతంగా వైరల్‌‌గా మారాయి. మరి తాప్సీ పన్ను చెప్పిన శారీరక శ్రమ అంటే ఇదేనేమో. అసలు హీరోయిన్లు అందరూ తమ హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే.. తాప్సీ పన్ను మాత్రం ఇలా కొత్తగా ఆకట్టుకుంటుంది.

Also Read:NTR- SS Rajamouli: ఎన్టీఆర్‌ ను హీరోగా రాజ‌మౌళి ఎందుకు ఇష్ట‌ప‌డ‌లేదు ?

Tags