Homeఎంటర్టైన్మెంట్Swayambhu teaser review: 'స్వయంభు' టీజర్ రివ్యూ: విజువల్స్ బాగున్నాయి..కానీ హీరో నిఖిల్ కి సెట్...

Swayambhu teaser review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ: విజువల్స్ బాగున్నాయి..కానీ హీరో నిఖిల్ కి సెట్ అవ్వలేదు!

Swayambhu teaser review: కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన సీనియాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన హీరోల్లో ఒకరు నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth). ఆయన గత చిత్రం ‘స్పై’ విడుదలై రెండేళ్లు పూర్తి అయ్యింది. వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ వచ్చిన నిఖిల్ కెరీర్ నుండి ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం విఫలం అయ్యింది. దీంతో కొన్నాళ్ల పాటు సుదీర్ఘంగా విరామం తీసుకున్న నిఖిల్ ‘స్వయంభు'(Swayambhu Movie) చిత్రంతో మన ముందుకు ఈ సమ్మర్ కి రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఠాగూర్ చిత్రాన్ని నిర్మించిన మధు, ఈ సినిమాకు కూడా నిర్మాత. సుమారుగా మూడేళ్ళ నుండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మరి నేడు విడుదల చేసిన టీజర్ ఎలా ఉందో ఒక వివరంగా ఈ విశ్లేషణలో చూద్దాం.

టీజర్ ని చూస్తుంటే చాలా రిచ్ గా గ్రాండియర్ విజువల్స్ తో అదిరిపోయింది. నిఖిల్ మార్కెట్ రేంజ్ కంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టారు అని అనిపిస్తోంది కానీ, వాస్తవానికి అంత బడ్జెట్ అవ్వలేదు. తక్కువ బడ్జెట్ లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారట. అయితే ఏ సినిమాకు అయినా అంచనాలు ఏర్పడాలంటే కచ్చితంగా టీజర్ నుండే విశేషంగా ఆడియన్స్ నుండి ఆకట్టుకుంటూ రావాలి. అలా ఈ టీజర్ లో వావ్ అనిపించే విధంగా ఒక్క షాట్ కూడా లేదు. ఎదో మంచి ప్రయత్నం అయితే చేశారని చూస్తే అనిపిస్తోంది కానీ, సినిమా పై భారీ అంచనాలను ఏర్పడేలా మాత్రం ఈ టీజర్ లేదు. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. శ్రీరాముడికి మహాశివుడి ఇచ్చిన సింధూరి ని కాపాడుకునే పాత్రలో ఇందులో నిఖిల్ కనిపించనున్నాడు. సినిమా మొత్తం ఈ ఆయుధం చుట్టూనే తిరగనుంది.

ఇకపోతే ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు సంయుక్త మీనన్, మరొకరు నభా నటేష్. కానీ టీజర్ లో కేవలం సంయుక్త మీనన్ మాత్రమే కనిపించింది. ఆమె గెటప్ ని చూస్తుంటే బాహుబలి లోని తమన్నా గెటప్ గుర్తు రాక తప్పదు. ఇలా ఈ టీజర్ ని చూస్తున్నంతసేపు బాహుబలి, మగధీర చిత్రాలను మిక్స్ చేసి కొట్టినట్టుగా అనిపించింది. ఇక రవి బర్సూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏమాత్రం కూడా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. ఆయనకు ఇదే మొదటి సినిమా అట. ఆ అనుభవం లేమి స్పష్టంగా కళ్ళకు కనిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఇండియన్ భాషలతో పాటు, ఫారిన్ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నారు అట. అలా పాన్ వరల్డ్ లో విడుదల చేసేంత కంటెంట్ ఇందులో ఏముందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Swayambhu - Epic Teaser (Telugu) | Nikhil Siddhartha | Samyukta | Nabha | Bharat | Ravi Basrur

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version