Anasuya: ‘హాట్ యాంకర్ అనసూయ’ ఆసక్తికరమైన బోల్డ్ విషయాలను ప్రేక్షకులతో మొహమాటం లేకుండా చక్కగా పంచుకుంటూ ముందుకు పోతుంది. అసలు భారీ బోల్డ్ కామెంట్స్ చేయడం ఒక్క అనసూయకే సాధ్యం. పైగా ‘అనసూయ’ అందంగా కనిపించడానికి కాస్త ఎక్కువ మేకప్ వేసుకుంటూ కూడా తనను తాను చాలా బాగా సమర్థించుకుంటూ ఉంటుంది. అన్నట్టు ఈ హాట్ యాంకర్ తాజాగా అభిమానులతో ఇంటరాక్ట్ అయింది.

ఇలా నెలకోసారి అయినా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటుంది ఈ ముదురు హాట్ భామ. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో ఓ Q&A చేసింది. అయితే, ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి’ అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు తెలీదు కదా ! నీ ప్రశ్న ఏజ్ షేమింగ్ అనిపిస్తుంది. నీ పెంపకం మీద అనుమానం వస్తుంది.’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
మొత్తానికి అనసూయ రిప్లై కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ మధ్య తన ఎక్స్ పోజింగ్ పై ట్రోలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ? అంటూ అందరికీ క్లాస్ కూడా తీసుకుంది. అసలు హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు కదా. అదే నేను చేస్తే తప్పు ఎలా అవుతుంది ? హీరోయిన్లను ఎందుకు మొత్తం కప్పుకోమని చెప్పరు ?, అదే నా విషయంలో మాత్రం ప్రతి ఒక్కడూ కామెంట్ చేసేవాడే. నా బాడీ నా ఇష్టం. నేను ఎంత చూపించాలి అనేది కూడా నా ఇష్టమే’ అంటూ ఇలా సాగింది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. మొత్తమ్మీద అనసూయ రేంజే వేరు.

అన్నట్టు ఈ ‘హాట్ యాంకర్ మరోసారి తల్లి కావాలని ఆశ పడుతుంది. మాతృత్వాన్ని అనుభవించాలనే కోరిక ఆమెలో రోజురోజుకు ఎక్కువైపోతుందట. మాతృత్వం అనుభూతి తనకు ఎంతో ఇష్టమని, ఒకరికి జన్మని ఇస్తే ఆ ఫీలింగ్ సూపర్ అని అంటుంది అనసూయ. ఒకవేళ తనకు పాప పుడితే తన లైఫ్ లో ఎక్కువ సమయాన్ని ఆ పాపకే కేటాయిస్తాను అని కూడా చెబుతుంది. ఇప్పటికే అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తల్లి కావాలనుకుంటుందట. మరి ఆమెగారి భర్త అభిప్రాయం ఏంటో తెలీదు.
Also Read: దినసరి కూలీ.. కుక్క కోసం అంత పనిచేశాడా?