
తెరపై క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి. అలాంటి సినిమాలు ఎన్నో వచ్చినా ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంటాయి. తాజాగా తెలుగులో మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. హృషికేష్, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవికా సతీషన్ ప్రధాన పాత్రల్లో నటింస్తున్న తాజాగా చిత్రం ‘బొమ్మల కొలువు’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏవీఆర్ స్వామి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ‘బొమ్మల కొలువు’ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది.
ట్రైలర్ చూస్తుంటే ప్రధానంగా లవ్ రోమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. మూడు పాత్రల చుట్టూ తిరిగే ఒక థ్రిల్లర్ లాగా తెలుస్తోంది. నగరంలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వాళ్లు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటుంటారు. వాళ్లు ఏమయ్యారు? అసలు ఎలా మాయం అవుతున్నారన్నదే సస్పెన్స్ గా ట్రైలర్ లో చూపించారు.
‘బొమ్మల కొలువు’ టైటిల్ కు తగ్గట్టుగానే చెక్క బొమ్మలను చూపిస్తూ ఇందులో వాటిలో ఏదో దాగి ఉందన్నట్టుగా సస్పెన్స్ ను బాగానే క్రియేట్ చేశారు. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఊపిరాడకుండా తీసినట్టుగా తెలుస్తోంది. అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్య చేస్తున్న ఆ క్రిమినల్ ఎవరన్నది? ఎందుకు చేస్తున్నాడు?ఈ బొమ్మల కథ ఏంటన్నది ఆద్యంతం ఆకట్టుకునేలా ట్రైలర్ చూపించారు.
పర్విన్ లక్కరాజు అందించిన సంగీతం.. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.
‘బొమ్మల కొలువు’ ట్రైలర్ ను కింద చూడొచ్చు.