Sushant Singh Rajput
Sushant Singh Rajput: 2020 జూన్ 14న బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ రాజ్ పుత్ మరణం పలు వివాదాలకు దారి తీసింది. ఇన్సైడర్ అండ్ అవుట్ సైడర్ అనే వాదన తెరపైకి వచ్చింది. సుశాంత్ సింగ్ మరణానికి నెపోటిజం కారణమైంది. అవుట్ సైడర్ అయిన సుశాంత్ రాజ్ పుత్ అవకాశాలు లాగేసుకున్నారు. అతనికి వచ్చిన సినిమాలు ఆపేశారు. అవకాశాలు రాకుండా చేశారు. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
సోషల్ మీడియాలో దీనిపై ఉద్యమమే నడిచింది. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, అలియా భట్, మహేష్ భట్, కరణ్ జోహార్ తో పాటు పలువురు నెపోకిడ్స్, ఇండస్ట్రీ పెద్దలను జనాలు టార్గెట్ చేశారు. కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. సుశాంత్ మరణం బర్నింగ్ టాపిక్ అయ్యింది. మరణంపై విచారణ జరపాలన్న డిమాండ్ తో ఈడీ, సీబీఐ, ఎన్సీబీ వంటి జాతీయ ఇన్వెస్టిగేషన్ విభాగాలు రంగంలోకి దిగాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ అరెస్ట్ అయ్యారు.
ఈ కేసు అనేక మలుపు తిరిగింది. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్నారు. క్రమేణా సుశాంత్ సింగ్ కేసు మరుగునపడుతూ వచ్చింది. కాగా సుశాంత్ సింగ్ మళ్ళీ పుట్టాడంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అందుకు కారణం.. సుశాంత్ ని పోలిన ఓ కుర్రాడి వీడియోలు సంచలనం రేపుతున్నాయి. అతని పేరు డెమిన్ అయాన్ అట. ఈ కుర్రాడి వీడియోలు చూసిన జనాలు.. సుశాంత్ మల్లీ పుట్టాడు. అచ్చు అతడిలానే ఉన్నాడని అంటున్నారు. ఆ వీడియోల మీద మీరు కూడా ఓ లుక్ వేయండి..
సీరియల్ నటుడిగా సుశాంత్ కెరీర్ మొదలైంది. 2013లో కై పో చే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. రెండో చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్ మూవీతో హిట్ కొట్టాడు. ధోని మూవీలో మహేంద్ర సింగ్ ధోని రోల్ చేశాడు. కేధార్ నాథ్, ఛిచ్చోరే వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన చివరి చిత్రం దిల్ బేచారా … మరణం అనంతరం విడుదలైంది.
Web Title: Sushant singh rajput is sushant singh rajput born again the video is trending on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com