Surya Kiran: బతికున్నప్పుడు విజయాలు సాధిస్తారు.కొందరు స్టార్లుగా ఎదుగుతారు. కొందరు స్టార్ స్టేటస్ ను సంపాదించక పోయినా అభిమానులను మాత్రం సొంతం చేసుకుంటారు. కానీ చనిపోయిన తర్వాత అందరిని శోక సంద్రంతో నింపుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు డైరెక్టర్ సూర్య కిరణ్. నటుడిగా, డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించిన సూర్య కిరణ ఇక లేరని వార్తను ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. అయితే ఈయన గతంలో చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య కిరణ్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. సినిమల్లో నటించినా కూడా ఈయనకు దర్శకుడిగానే మంచి పేరు ఉంది. సత్యం, రాజ్ భాయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ నటుడు అవే సినిమాలతో మంచి పేరును కూడా సంపాదించారు. తక్కువ సినిమాలే చేసిన మంచి పేరు సంపాదించారు సూర్య కిరణ్. ఇక బాలనటుడిగా ఈయన ఏకంగా 200కు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు ఈయన సహాయనటుడిగా కూడా అదరగొట్టాడు.
ఈయన మరణ వార్త విని ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే ఈయన మరణానికి కారణం జాండీస్ అని తెలుస్తోంది. పచ్చ కామెర్లతో బాధ పడుతున్న సూర్య కిరణ్ గుండెపోటుతో మరణించారట. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని వారం రోజులు మాత్రం ఉన్నారు. అయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. చనిపోవడానికి ముందు భార్య గురించి కొన్ని కామెంట్లు చేశారు సూర్య.
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సిస్టర్స్ పై ఎంత ప్రేమ ఉంటుందో కళ్యాణి పై కూడా అంతే ప్రేమ ఉందని తెలిపారు. కళ్యాణి అంటే ఇష్టం, ప్రేమ రెండు ఉన్నాయన్నారు. నేను తనకు అవసరం లేదు కావచ్చు. కానీ నాకు మాత్రం తను అవసరమే అన్నారు. ఇప్పటికీ కూడా నా ఫోన్, ల్యాప్ టాప్ లో కళ్యాణీ పోటోనే ఉంటుందని వివరించారు. ఇప్పటికి కాదు ఇంకెన్ని జన్మలెత్తినా నా భార్య స్థానం కళ్యాణిదే అంటూ పేర్కొన్నారు సూర్య కిరణ్. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవడంతో అభిమానులు బాధ పడుతున్నారు.