Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండనున్నాయో తెలిపేలా టీజర్ ద్వారా వెల్లడించారు. ఈ ప్రోమో వీడియొ లకు భారీ స్పందన లభించింది. అలానే సినిమా లోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా… దానికి విపరీతమైన బజ్ వచ్చింది. రీసెంట్ గానే ‘అంత ఇష్టం ఏందయ్యా’ అంటూ సాగే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడు సినిమా నుంచి మరో ‘బ్లాస్టింగ్ అప్డేట్’ రాబోతుందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దర్శకనిర్మాతలు.
నవంబర్ 3 న ఉదయం 11 గంటలకు ‘భీమ్లా నాయక్’ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుందని చిత్రా బృందం ప్రకటించింది. ఈ సినిమాలో నుంచి మూడో సింగిల్ ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అయితే దీపావళి కానుకగా రానా, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న తిజర్ ను రిలీజ్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయక తప్పదు. ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే … క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’… హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో కూడా మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
A BLASTING UPDATE is ready to fire up! 🥁🔥
Stay Tuned, Tomorrow @ 11 AM 💥#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @SitharaEnts pic.twitter.com/dtPcSIhsBS
— Naga Vamsi (@vamsi84) November 2, 2021