Puneeth Rajkumar: ఇటీవలే కర్ణాటక ప్రజలు సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను కోల్పోవడం జరిగింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పవర్ స్టార్ పునీత్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందంటూ పునీత్ బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. వెంటనే వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించగా చికిత్స తీసుకుంటూనే పవర్ స్టార్ పునీత్ తుదిశ్వాస విడిచారు.

పునీత్ అకాల మరణాన్ని కర్ణాటక ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే టాలీవుడ్ లో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగు ప్రజలు కూడా పునీత్ మరణంపై విచారాన్ని వ్యక్తపరిచారు. ఎంతో మందికి పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఆయన చేసిన మేలు వివరించలేనిది. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య, 45 ఫ్రీ స్కూల్స్ , 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు పునీత్. అలానే ఆయన తన రెండు కళ్ళను కూడా దానం చేశారు. ఆ నేత్ర దానం ద్వారా నలుగురు వ్యక్తులు చూపు పొందిన విషయం తెలిసిందే.
కాగా పునీత్ రాజ్ అంత్యక్రియలకు మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు కూడా వెళ్లారు. అయితే తాజాగా బెంగళూరులోని సదాశివ నగర్ లో గల పునీత్ నివాసానికి ఈరోజు చేరుకున్న నాగార్జున పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పునీత్ రాజ్ కుమార్ ఫోటోకు నివాళులర్పించి… వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు విశాల్.