Suresh Babu: నిర్మాత సురేష్ బాబుకి లౌక్యం ఎక్కువ అంటారు. అలాంటి లౌక్యం ఉన్న వ్యక్తి కూడా ఆవేశపడుతూ పబ్లిక్ గా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు అంటే.. బహుశా ప్రస్తుత పరిస్థితులే కారణం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆయన మాటల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఒక్క సురేష్ బాబులోనే కాదు, మిగిలిన సినీ ప్రముఖులందరిలో ఈ నిరాశ నిసృహలు ఎక్కువయ్యాయి. అంతలా ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం వాళ్ళను బాధ పెడుతుంది.

ఆ బాధలో మొత్తానికి డి.సురేష్ బాబు టికెట్ వ్యవహారం పై కీలకమైన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చారు. సురేష్ బాబు ఇన్నాళ్లు చాలా సైలెంట్ గా ఉన్నారు. కానీ జగన్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన టికెట్ రేట్లను ఆయన అసలు జీర్ణయించుకోలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన టికెట్ రేట్లు అమలైతే మాత్రం, వచ్చే కలెక్షన్స్ థియేటర్ కరెంటు ఛార్జీలు కూడా సరిపోవు.
నిజమే, మరి అంత దారుణ పరిస్థితులు గానీ వస్తే.. ఇక థియేటర్లు మూసుకోవాల్సి వస్తుంది. అందుకే సురేష్ బాబు తన ఆవేదనను వ్యక్తం చేయడానికి హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి మరీ తన బాధను ప్రేక్షకులు చెప్పుకున్నాడు. సురేష్ బాబు మాటల్లోనే ‘కొత్తగా ఇప్పుడు నేను ఏమి చెప్పక్కర్లేదు. జరుగుతున్నవన్నీ మీకు తెలుసు.
కానీ, ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా మాట్లాడతాను. మార్కెట్లో ఒకొక్క వస్తువుకీ ఒక్కో రేటు ఉంటుందనేది అందరికి తెలుసు. అయితే, అన్ని వస్తువుల్ని కలిపి ఒకే రేటుకి అమ్మాలంటే కుదిరితుందా ? మరి సినిమాల్లో కూడా రకరకాలుంటాయి. అన్నీ సినిమాలను ఒకే రేటుకి ఎలా అమ్మేది ? పెద్ద సినిమాలకు అయ్యే బడ్జెట్ వేరు. చిన్న చిత్రాల బడ్జెట్ వేరు.
Also Read: అక్క ‘లవర్’ చెల్లి బెస్ట్ ఫ్రెండ్… తెగింపంటే ఇదీ!
చిన్న పెద్ద సినిమాలకూ ఒకే రేటు పెట్టడం భావ్యం కాదు. అసలు సినిమా ఇండస్ట్రీ గట్టిగా వెయ్యి కోట్ల పరిశ్రమ కూడా కాదు. అలాంటి చిన్న పరిశ్రమకు ఎందుకు ఇన్ని ఆంక్షలు ? టికెట్ ను ప్రేక్షకుడి బలవంతంగా కొనిపించలేం కదా. ఇష్టమొచ్చినవాళ్లు కొంటారు, లేదు అంటే లేదు. మా సినిమా చూడాల్సిందే అని ఎవరు ఎవర్నీ నిర్భందించలేరనేది అర్ధం చేసుకోవాలి.
ఒక్కటి మాత్రం నిజం, సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలి అంటే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలి’ అంటూ సురేష్ చెప్పుకుంటూపోయారు.
Also Read: ఆమె వెళ్ళిపోతే అతడి పరిస్థితి ఏమిటీ ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ !