
Surender Reddy – Akhil : అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘ఏజెంట్’.అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే అఖిల్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఒక్క బలమైన హిట్ కూడా కొట్టలేదు,అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు టాలెంట్ ఉన్నా కూడా అఖిల్ సక్సెస్ కాలేకపోవడం తో అభిమానులు ఎంతో నిరాశకి గురి చెందారు.అలాంటి సమయం లో సురేందర్ రెడ్డి లాంటి టాప్ డైరెక్టర్ ‘ఏజెంట్’ అనే చిత్రాన్ని ప్రకటించారు.
ఈ సినిమాకి సురేందర్ రెడ్డి కేవలం దర్శకత్వం వహించడమే కాదు, నిర్మాణం లో కూడా ఒక భాగం అయ్యాడు.రీసెంట్ గా విడుదల చేసిన టీజర్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ పాటలు ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు.ఇది ఇలా ఉండగా సినిమా విడుదల ఆలస్యం అవుతుకు వెళ్లడం తో సోషల్ మీడియా లో ఈ చిత్రం పై ఎన్నో రూమర్స్ వచ్చాయి.

అయితే నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఒకటి జరిగింది.ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి అఖిల్ తో మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆలస్యం అవుతున్న సమయం లో సోషల్ మీడియా లో ఎన్నో రూమర్స్ వచ్చాయి.సురేందర్ రెడ్డి కి మీకు గొడవలు జరిగాయని, ఆయన సెట్స్ వదిలి వెళ్లిపోయాడని ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి, దీనిపై మీ స్పందన ఏమిటి అని అడిగారు.
అప్పుడు అఖిల్ దానికి సమాధానం ఇస్తూ ‘సుమారు గా రెండేళ్ల నుండి ప్రయాణం చేస్తున్నాం, ఈ ప్రయాణం లో చిన్న చిన్న అలకలు రాకుండా ఉంటుందా..?, సురేందర్ రెడ్డి గారికి కరోనా వచ్చింది, ఆయన తిరిగి కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది.షూటింగ్ కి గ్యాప్ రావడానికి కారణం అదే, ఆయనని నెల రోజుల పాటు ఎమర్జెన్సీ వార్డు లో ఉంచి చికిత్స అందించారు,ఒక్క మాటలో చెప్పాలంటే చావుతో పోరాటం చేసి బయటకి వచ్చాడు ఆయన.. ఇవన్నీ ఎవరికీ తెలియవు కాబట్టి ఇష్టమొచ్చిన పుకార్లు పుడుతుంటాయి’ అంటూ అఖిల్ చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు.