https://oktelugu.com/

Supreeta : చెన్నై హోటల్ లో బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా బుక్ అయిన సురేఖావాణి కూతురు సుప్రీత!

ఇక త్వరలోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కానుంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఇందులో సుప్రీత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Written By: , Updated On : April 13, 2024 / 08:01 PM IST
Surekhavani's daughter Supreeta with boyfriend in Chennai hotel

Surekhavani's daughter Supreeta with boyfriend in Chennai hotel

Follow us on

Supreeta : నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. నటిగా మారకముందే ఓ హీరోయిన్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తూ ఉంటుంది సుప్రీత. అయితే తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న వీడియో ఒకటి షేర్ చేసింది. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

కాగా సుప్రీత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒకే గదిలో ఉండటం గమనార్హం. ఆమెకు ఆరోగ్యం బాగోలేక పోయినా తన బాయ్ ఫ్రెండ్ కి ఏమాత్రం జాలి లేదని .. అసలు పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నాడు అని వీడియోలో సుప్రీత చెప్పుకొచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆమె షేర్ చేసింది. సదరు వీడియోలో ఉన్న వ్యక్తి సుప్రీత బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె చెప్పింది. అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి చెన్నై వెళ్లారట.

ఇక అక్కడికి వెళ్లిన తర్వాత సుప్రీత ఆరోగ్యం కాస్త పాడైందట. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన ఫ్రెండ్స్ తో కలిసి మెరీనా బీచ్ కి వెళ్లిన్నట్లు సుప్రీత షేర్ చేసిన వీడియో చూస్తుంటే తెలుస్తుంది. కాగా సదరు వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక సుప్రీత కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ఇప్పటికే యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్స్, షాట్ ఫిలిం లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇక త్వరలోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కానుంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఇందులో సుప్రీత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తనకు మొదటి డెబ్యూ ఫిల్మ్. కాగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది.