https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ కోసం సురేఖ సంచలన నిర్ణయం..ఇప్పటి వరకు కొడుకు రామ్ చరణ్ కోసం కూడా ఇలాంటి పని చేయలేదుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఈ నెల మొత్తం ఎలా మారుమోగిపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 27, 2024 / 04:08 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఈ నెల మొత్తం ఎలా మారుమోగిపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక పక్క ఆయన ‘పుష్ప 2 ‘ చిత్రం తో దేశం మొత్తం రీ సౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టి, ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన మొట్టమొదటి నాన్ రాజమౌళి హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి త్వరలోనే ఆయన మొట్టమొదటి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఇండియన్ హీరో గా కూడా మరో సంచలన రికార్డుని తన పేరు మీద నమోదు చేయబోతున్నాడు. ఇన్ని విజయాలు సాధించిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పడకుండా ఎలా ఉంటుంది?, అల్లు అర్జున్ మీద ఆ దిష్టి ప్రభావం చాలా గట్టిగా పడింది. అందుకే చెయ్యని నేరానికి అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంజాయ్ చెయ్యాల్సిన సమయం లో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది.

    ఈ ఘటన పట్ల మెగా ఫ్యామిలీ సపోర్టు అల్లు అర్జున్ కి బహిరంగంగా ఇవ్వకపోయినా, వెనుక నుండి మాత్రం చాలా బలమైన సపోర్టు లభించింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంభర షూటింగ్ ని రద్దు చేసుకొని చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరడం జరిగింది. కానీ పోలీసులు స్టేషన్ కి రావడానికి వీలు లేదని బలమైన సందేశం ఇవ్వడంతో చిరంజీవి తన సతీమణి సురేఖ తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనమంతా గత నెల రోజులుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై చాలా బెంగ పెట్టేసుకుంది. బిడ్డ అంత పెద్ద సక్సెస్ కొట్టి సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిందే అని ఆమె చాలా బాధ పడింది.

    ఈ సంఘటన జరిగిన రెండు రోజులు ఆమె అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండడం గమనార్హం. బెయిల్ మీద విడుదలై బయటకి వచ్చే వరకు ఆమె అక్కడే ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కలిసి, అతనికి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ఈ కేసు వ్యవహారం నుండి బయటపడాలని, అలా బయటపడిన రోజు వెయ్యి మందికి అన్నదానం చేయిస్తానని ఆమె దేవుడికి మొక్కుకుందట. ఇంతలా ఒకరి గురించి ఆమె భయపడి దేవుడికి మొక్కుకోవడం అల్లు అర్జున్ విషయం లోనే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీనిని బట్టి ఆమెకి తన కొడుకు లాంటి అల్లు అర్జున్ తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. సురేఖ గారు కేవలం అల్లు అర్జున్ విషయం లో మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులందరితో ఇలాగే ఆప్యాయంగా ఉంటుంది.