https://oktelugu.com/

Supreeta : చీరకట్టులో దర్శనమిచ్చి కుర్రాళ్లకు షాక్ ఇచ్చిన సుప్రిత… ఫోటోలు వైరల్…

ఇక అందులో భాగంగానే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది. సురేఖ వాణి సుప్రీతలు ఇద్దరు గోవా, బ్యాంకాక్, దుబాయ్ లాంటి ప్రాంతాలకు తిరుగుతూ విపరీతమైన ఎంజాయ్ చేస్తూనే అభిమానులకు కూడా వాళ్ళ ఎంజాయ్ మెంట్ ని పంచుతూ వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు...

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2024 / 09:43 PM IST

    Supritha's photos in saree go viral

    Follow us on

    Supreeta : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేవాళ్ళలో నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. సుప్రీత అయితే చిన్న చిన్న బట్టలు వేసుకొని రీల్స్ చేస్తూ ఫోటోలు దిగుతూ ఆ వీడియోలను గాని, ఫోటోలను గాని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకుంది. ఒక హీరోయిన్ కి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో, ప్రస్తుతం సుప్రీతకి అలాంటి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే తను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేదని అర్థమవుతుంది.

    ఇక ప్రస్తుతం ఆమె చీర కట్టులో బొట్టు పెట్టుకొని సాంప్రదాయమైన రీతిలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇక దాంతో ఆమె ఫోటోలను చూసిన యువత విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఎప్పుడు హాట్ లుక్స్ తో కుర్రాళ్ళకు పిచ్చెక్కించే సుప్రీత ఇప్పుడు సాంప్రదాయ రీతిలో ఉంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం నీకు ట్రెడిషన్ లుక్ కంటే వెస్ట్రన్ లుక్కే అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే సుప్రీత ఏదో ఒక రకంగా సోషల్ మీడియా ఫోటోలు పెట్టీ తన ఫాలోవర్స్ లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక సురేఖ వాణికి ఏ మాత్రం టైం దొరికిన కూడా వీళ్లిద్దరూ పార్టీలు అంటూ తిరుగుతూ ఉంటారు.

    అలాగే వెకేషన్ కి వెళ్తూ అక్కడ వాళ్ళు దిగే ఫోటోలను అప్లోడ్ చేయడం, తల్లి కూతుర్లు ఇద్దరు డాన్సులు వేస్తూ వాటిని తమ ఫాలోవర్స్ తో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అందువల్లే వీళ్లకు విపరీతమైన క్రేజ్ అయితే ఏర్పడింది. ప్రస్తుతం సుప్రీత బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ తో ఒక సినిమా కూడా చేస్తుంది. ఇక ఇటీవలే దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఆమె హీరోయిన్ గా స్క్రీన్ మీద తన నట విశ్వరూపాన్ని చూపించబోతుంది.

    ఇక అందులో భాగంగానే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది. సురేఖ వాణి సుప్రీతలు ఇద్దరు గోవా, బ్యాంకాక్, దుబాయ్ లాంటి ప్రాంతాలకు తిరుగుతూ విపరీతమైన ఎంజాయ్ చేస్తూనే అభిమానులకు కూడా వాళ్ళ ఎంజాయ్ మెంట్ ని పంచుతూ వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు…