Supritha: సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగుపెడితే విడిచిపెట్టబుద్దికాదు. కొందరు సినిమాల్లోకి రావడమే కాకుండా వారి వారసులను కూడా తీసుకొచ్చి స్టార్లను చేస్తారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్ గా ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన సురేఖవాణి హీరోయిన్ కాకపోయినా ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక సినిమాల్లో ఎంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా.. సురేఖవాణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా తల్లితో పాటు సెలబ్రెటీగా మారింది. ఆమె సినిమాల్లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ట్రెండీ గాల్ గా మారింది. లేటేస్టుగా సుప్రీత చేసిన పనికి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.
సురేఖ వాణి కూతురుగానే కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుంది సుప్రీత. తల్లితో కలిసి షికార్లు చేస్తూ పబ్బుల్లో కనిపిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమె సినీ ఎంట్రీ కోసం ఎన్నో రోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే అవకాశాలు మాత్రం దరిచేరడం లేదు. అయినా ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. హీరోయిన్ కాకపోయినా సుప్రీతకు ఇన్ స్ట్రాగ్రామ్ లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. వారిని అలరించేందుకు సుప్రీత ఎప్పటికప్పుడుచిట్ చాట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ కారులో వెళ్తున్న కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చేతిలో మొబైల్ పట్టుకొన్ని ముద్దులు పెడుతూ ఫొటోలు దిగింది. ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా కిస్సులు పెడుతూ స్నాప్ తీసుకుంది. ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో ఓ పిక్ కు పులి లా ఉండే బొమ్మలను యాడ్ చేసి అప్లోడ్ చేసింది. సాధారణంగానే సుప్రీత పిక్స్ వైరల్ అవుతూ ఉంటాయి.
ఇక లేటేస్ట్ పిక్స్ కాస్త యూత్ ను ఇంప్రెస్ చేసేలా ఉండడంతో కుర్రకారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ముద్దులు ఎవరికీ పెడుతున్నారు? అంటూ కొందరు కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే మరికొందరు మాత్రం సినీ ఎంట్రీ ఎప్పుడు? అని అడుతున్నారు. సుప్రీత సినీ ఎంట్రీ గురించి తల్లి సురేఖ వాణి ని ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మకు అవకాశం వస్తుందా? లేదా చూడాలి.