Actress Pratyusha Case: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ధ్రువ తార లాగ దూసుకొచ్చి అతి తక్కువ సమయం లోనే పెద్ద రేంజ్ హీరోయిన్ గా ఎదిగిన ప్రత్యూష(Heroine Pratyusha), 2002 వ సంవత్సరం, ఫిబ్రవరి 23న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ తర్వాత ఆమెని హాస్పిటల్ కి తీసుకొని పోగా, చికిత్స పొందుతూ మరణించడం అప్పట్లో సంచలనం గా మారింది. ఈ ఘటనకు సిద్దార్థ్ రెడ్డి నే కారణమని అప్పట్లో ప్రత్యూష తల్లి సరోజినీ ఫిర్యాదు చేసింది. దీని పై అనేక విచారణలు జరిపిన తర్వాత సెషన్స్ కోర్టు సిద్దార్థ్ రెడ్డి కి ఐదేళ్ల జైలు శిక్ష ని విధించింది. దీంతో సిద్దార్థ్ రెడ్డి హై కోర్టు ని ఆశ్రయించగా, రెండేళ్లకు కుదించింది. హై కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ ప్రత్యూష తల్లి సరోజినీ సుప్రీమ్ కోర్టు లో పిటీషన్ వేసింది.
దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీమ్ కోర్టు హై కోర్టు తీర్పు కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో సిద్దార్థ్ రెడ్డి ఎక్కడున్నా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ప్రత్యూష తల్లి 24 ఏళ్ళ నుండి చేస్తున్న న్యాయపోరాటం లో విజయం సాధించి, తన కూతురు ఆత్మకు శాంతి కలిగించేలా చేసింది. ఆలస్యం అయినా, న్యాయం జరిగినందుకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో ప్రత్యూష, సిద్దార్థ్ ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వీళ్లిద్దరి ప్రేమని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఇద్దరు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రత్యూష చికిత్స పొందుతూ మరణించగా, సిద్దార్థ్ రెడ్డి మాత్రం బ్రతికాడు. అయితే ప్రత్యూష తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు ఆత్మహత్య చేసుకునే రకం కాదు, కచ్చితంగా సిద్దార్థ్ రెడ్డి కుట్ర చేసి చంపేశాడు అనే అనుమానంతో పోస్ట్ మార్టం చేయించారు. ఆ రిపోర్టు లో తేలింది ఏంటంటే ప్రత్యూష కి నిజమైన పురుగుల మందు కలిపి ఇచ్చారని.
కానీ సిద్దార్థ్ రెడ్డి ఎలాంటి పురుగుల మందు తీసుకోలేదు, కేవలం నాటకం ఆడుతూ, నాకు ఉన్న రాజకీయ పలుకుబడి ని ఉపయోగించి హాస్పిటల్ వాళ్ళను కూడా మ్యానేజ్ చేసాడు. ఇవన్నీ ఆధారాలతో సహా నిరూపించడం తో 2004 వ సంవత్సరం లో సిద్దార్థ్ రెడ్డి కి సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సెషన్స్ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ సిద్దార్థ్ హై కోర్టు కి వెళ్లడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం ఈమధ్య కాలం లో మనం చూసాము. ఇక ప్రత్యూష నట ప్రస్థానం విషయానికి వస్తే 1998 వ సంవత్సరం లో ఈమె మోహన్ బాబు హీరో గా నటించిన ‘రాయుడు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. అందులో మోహన్ బాబు కూతురిగా ఆమె నటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ తర్వాత ఈమె తెలుగు తమిళ భాషలకు కలిపి 11 సినిమాల్లో నటించి, కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో ఇలా ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.