Heroine Regina: చిన్న అవకాశం దొరికితే చాలు, తెలుగు వాళ్ళను కించపర్చడానికి క్షణం కూడా ఆలోచించరు నార్త్ ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ చాలా పెద్దది, అయినప్పటికీ కూడా మన సౌత్ సినిమాలు బాలీవుడ్ ని మించి వసూళ్లను రాబట్టడాన్ని అక్కడి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బాహుబలి 2 చిత్రం విడుదలై దాదాపుగా 9 అవుతోంది. ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా ‘బాహుబలి 2’ కి దరిదాపుల్లో వెళ్లలేకపోయింది. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, బాలీవుడ్ మూవీ మేకర్స్ కి ఎందుకు మన సౌత్ ఇండియన్స్ అంటే అంత అక్కసు, కోపం అనేది. రీసెంట్ ప్రముఖ హీరోయిన్ రెజీనా(Regina Cassandra) బాలీవుడ్ మేకర్స్ ప్రవర్తన తీరుపై చేసిన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
2019 వ సంవత్సరం లో రెజీనా కాసాండ్రా బాలీవుడ్ లో ‘ఏ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ అనే హిందీ చిత్రం చేసింది. ఈ సినిమాతో పాటు మరికొన్ని హిందీ సినిమాల్లో కూడా ఆమె నటించింది. అక్కడి మేకర్స్ తో ఆమెకు ఎదురైన అనుభవం గురించి చెప్తూ ‘నేను సౌత్ ఇండియన్ హీరోయిన్ ని కాబట్టి, నన్ను అక్కడి మేకర్స్ ఒకే మూసలో బంధించారు. చాలా మంది హీరోయిన్స్ తో పోలిస్తే నేను హిందీ అద్భుతంగా మాట్లాడగలను. వాళ్ళకంటే బాగా రాయగలను, చదవగలను కూడా. డబ్బింగ్ ని కూడా నేను వేరే వాళ్ళతో చెప్పించే దానిని కాదు. సొంతం గానే చెప్పేదానిని. హిందీ భాషను అంత గౌరవించాను. అయినప్పటికీ నన్ను వాళ్ళు పరాయి అమ్మాయి లాగానే చూసేవారు. అంతే కాదు అనేక మంది నన్ను చులకనగా చూసి అవమానించేవారు’ అంటూ చెప్పుకొచ్చింది.
కొన్ని సినిమాల్లో తనని తక్కువ చేసి చూపించేవారని, ఆ విషయం తనకి అర్థం అయ్యినప్పటికీ ఇచ్చిన కమిట్మెంట్స్ ని పూర్తి చెయ్యాలి కాబట్టి తప్పక చేసానని, ఆ తర్వాత ఉత్తరాది సినిమాలు చేయడం పూర్తిగా మానేశాను’ అంటూ చెప్పుకొచ్చింది రెజీనా. సౌత్ లో ఒక ఎస్టాబ్లిష్ హీరోయిన్ కే ఇన్ని అవమానాలు జరిగితే, కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చే హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. రెజీనా కేవలం అందాలను ఆరబోసే హీరోయిన్ కి, నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకునే అతి కొద్దిమంది హీరోయిన్స్ లో ఒకరు. ఈమధ్య కాలం లో ఆమె ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేస్తోంది. ఆమె గత చిత్రం ‘జాట్’ కూడా హిందీ నే. అందులో కూడా ఆమె విలన్ క్యారెక్టర్ చేసింది. ఉత్తరాది సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ చిత్ర డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు వాడు కావడంతో ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది.