Supreetha: స్కిన్ షో చేసినంతమాత్రాన.. సోషల్ మీడియాలో రీల్స్ చేసినంత మాత్రాన..బూతులు మాట్లాడినంత మాత్రాన.. సెలబ్రిటీలు కాలేరు. నేటి కాలంలో కొన్ని రియాల్టీ షోలు పై లక్షణాలు ఉన్న వారికే అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. ఆ రియాల్టీ షోలు ముగిసిన తర్వాత వారిని ఎవరూ పట్టించుకోరు. కాకపోతే ఆ రియాల్టీ షోలలో పాల్గొన్నవారు తమను తాము సెలబ్రిటీలుగా ఊహించుకుంటారు. తమను తాము గొప్ప వ్యక్తులుగా చెప్పుకుంటారు. కానీ వాస్తవంలోకి వస్తే వారికి అసలు పరిస్థితి అర్థం అవుతుంది.. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఓ యువతీకి ఎదురైంది.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
తెలుగు చిత్ర పరిశ్రమలో సురేఖ వాణి పేరుపొందిన నటి. ఈమె అనేక సినిమాలో నటించింది. ముఖ్యంగా బాద్ షా సినిమాలో బ్రహ్మానందానికి భార్యగా నటించి మెప్పించింది. అంతకుముందు రెడీ సినిమాలో విలన్ భార్యగా నటించి ఆకట్టుకుంది. ఈ రెండు పాత్రలు ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలో చేసిన పాత్రకు గుర్తింపు లభించింది. సురేఖ వాణి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది. సురేఖ వాణికి కూతురు సుప్రీతా ఉంది. సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. స్కిన్ షో చేయడంలో ముందు ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది.
ఆమధ్య నాయుడు గారి అమ్మాయి.. చౌదరి గారి అమ్మాయి అనే సినిమాలో నటించింది. కొన్ని రియాల్టీ షోల లో కూడా మెరిసింది. అప్పట్లో ఓ చానల్లో ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన ఒక కార్యక్రమంలో ఓ యూట్యూబర్ తో కలిసి సందడి చేసింది. అంతేకాదు అతనితో ప్రేమలో ఉన్నట్టు బయటకు చెప్పింది. కానీ అదంతా నిజం కాదని తర్వాత తేలింది. తన తల్లితో కలిసి విహార యాత్రలకు వెళ్లే సుప్రీత.. అభిమానులకు అందాల విందు ఇస్తూ ఉంటుంది. అటువంటి సుప్రీత ఇటీవల ఓ పుణ్యక్షేత్రం వద్దకు వెళ్ళింది.. దైవ దర్శనం అనంతరం బయటికి వచ్చింది. అయితే సుప్రీతను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒక సాధారణ భక్తురాలిగానే అందరూ చూశారు. ఒకప్పుడు సెలబ్రిటీ బయటకు వస్తే ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి చాలామంది ఆరాటపడేవారు. ఇప్పటి కాలంలో సెల్ఫీలకు ఎగబడుతున్నారు. కానీ సుప్రీత బయటికి వస్తే ఎవరూ ఆటోగ్రాఫ్ అడగలేదు. కనీసం సెల్ఫీ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీనినిబట్టి తన స్టేటస్ ఏమిటో సుప్రీతకు అర్థమయ్యే ఉంటుంది.