https://oktelugu.com/

Vettaiyan Trailer : నీరసంగా సాగిన రజినీకాంత్ ‘వెట్టియాన్’ ట్రైలర్.. దెబ్బేసిన అనిరుద్..అదేమీ మ్యూజిక్ సామీ!

సోషల్ మీడియా లో రజనీకాంత్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గా విడుదలైన 'దేవర' చిత్రానికి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యింది. ఈ సినిమాకి ఎలా చేసాడో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2024 / 08:04 PM IST

    Vettaiyan Trailer

    Follow us on

    Vettaiyan Trailer : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’. ‘జై భీం’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన జ్ఞాన వేల్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన ‘హంటర్ బంటర్’ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అక్టోబర్ 10 వ తారీఖున తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. తమిళం లో ఉన్నటువంటి ‘వెట్టియాన్’ టైటిల్ ని తెలుగు లో కూడా పెట్టారు. క్రింద క్యాప్షన్ గా ‘ది హంటర్’ అని ఉంది. ఈ చిత్రం లో రజనీకాంత్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, దగ్గుపాటి రానా, ఫహద్ ఫాజిల్ వంటి టాప్ స్టార్స్ నటించారు. విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ని గమనిస్తే ఇందులో సూపర్ స్టార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు.

    నగరంలో అమ్మాయిల మీద వరుసగా దాడులు, అత్యాచారాలు,హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దుర్మార్గులను ఎన్కౌంటర్ చేసి చంపేయాలి అని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజలు రోడ్డు మీదకు ఎక్కుతారు. సరిగ్గా వారి ఆలోచనలకు తగ్గట్టుగా బరిలోకి దిగుతాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్. అతని పై అధికారిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తాడు. ఏదైనా చట్టపరంగా చెయ్యాలి, చట్టానికి అతీతంగా వెళ్ళకూడదు అనుకునే స్ట్రిక్ట్ అధికారిగా ఇందులో అమితాబ్ బచ్చన్ కనిపించగా, నలుగురికి న్యాయం చేయడం కోసం అన్యాయమైన దారిలో వెళ్ళడానికి కూడా వెనకాడని పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపిస్తారు. అసలు నగరం లో ఈ వరుస హత్యలు చేస్తుంది ఎవరు?, అమ్మాయిలను ఈ విధంగా హింసిస్తున్న ఆ మృగాడిని రజినీకాంత్ ఎలా పట్టుకున్నాడు అనేది కథాంశంగా మనకి ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది.

    ఇందులో విలన్ ఎవరు అనే అంశం సస్పెన్స్ గానే అనిపించింది. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది కానీ, ‘జైలర్’ తరహాలో నేటి తరం ఆడియన్స్ ఆకర్షితులు అయ్యే అంశాలు ట్రైలర్ లో కనిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. ఇక ట్రైలర్ మొత్తానికి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే, అది అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. సినిమా ఎలా ఉన్నప్పటికీ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లే అనిరుద్ ఇంతటి నీరసంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడేంటి అని అనుకున్నారు ఆడియన్స్. ‘జైలర్’ ట్రైలర్ తో పోల్చి చూస్తూ, ‘ట్రైలర్ అంటే ఇది..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఈ రేంజ్ లో ఉండాలి’ అంటూ సోషల్ మీడియా లో రజనీకాంత్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘దేవర’ చిత్రానికి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యింది. ఈ సినిమాకి ఎలా చేసాడో చూడాలి.