Mahesh Babu: నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్…ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్…

సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన తర్వాత ఆయన నట వారసుడిగా వచ్చిన మహేష్ బాబు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మొదటి నుంచి కృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి మహేష్ బాబు ని సపోర్ట్ చేస్తూ వస్తుంటారు.

Written By: Gopi, Updated On : January 26, 2024 1:00 pm
Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులైతే మహేష్ బాబు కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఆయనంటే అభిమానులకు ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే దీనికి కారణం సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన తర్వాత ఆయన నట వారసుడిగా వచ్చిన మహేష్ బాబు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మొదటి నుంచి కృష్ణ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి మహేష్ బాబు ని సపోర్ట్ చేస్తూ వస్తుంటారు.అందువల్లే మహేష్ బాబు కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే మహేష్ బాబుకు కోకొల్లలు. ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే చాలు ఫ్యామిలీతో పాటు, లేడీ అభిమానులు కూడా థియేటర్లలో ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు.

ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా సంక్రాంతి కనుక గా వచ్చిన గుంటూరు కారం సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇక ఇప్పుడు రాజమౌళి తో చేయబోయే సినిమా మీద ఆయన ఎక్కువ కసరత్తులు చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ కాంబినేషన్ లో సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

ఇక ఇప్పుడు రాజమౌళి తో సినిమా చేసిన తర్వాత సందీప్ తో ఒక సినిమా రానున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే రాజమౌళి తో చేసే సినిమా పూర్తి అవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ మూడు సంవత్సరాల కాలంలో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ , అలాగే అల్లు అర్జున్ తో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి మహేష్ బాబు సినిమా కోసం రెడీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ న్యూస్ మహేష్ బాబు అభిమానులకు ఒక పండగలాంటిదనే చెప్పాలి…