https://oktelugu.com/

Pawan Kalyan- Paruchuri Gopalakrishna: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే చేయాల్సింది అదే.. లెజెండరీ రైటర్ క్రేజీ కామెంట్స్.. సంబరాల్లో జనసైనికులు !

Pawan Kalyan- Paruchuri Gopalakrishna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులతో పాటు ప్రజల క్షేమం కోరుకునే వారు కూడా ఆశ పడుతున్నారు. అలాగే, ఈ మధ్య మేధావులు కూడా పవన్ పై ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లోని నిజాయితీకి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లెజండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. పరుచూరి తన యూట్యూబ్ ఛానల్ లో […]

Written By:
  • Shiva
  • , Updated On : September 8, 2022 / 12:38 PM IST

    Pawan Kalyan- Paruchuri Gopalakrishna

    Follow us on

    Pawan Kalyan- Paruchuri Gopalakrishna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులతో పాటు ప్రజల క్షేమం కోరుకునే వారు కూడా ఆశ పడుతున్నారు. అలాగే, ఈ మధ్య మేధావులు కూడా పవన్ పై ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లోని నిజాయితీకి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లెజండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. పరుచూరి తన యూట్యూబ్ ఛానల్ లో ‘పరుచూరి పాఠాలు’లో పవన్ ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు.

    Pawan Kalyan- Paruchuri Gopalakrishna

    మరి ఏం మాట్లాడారో పరుచూరి గోపాలకృష్ణ మాటల్లోనే విందాం. ‘పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు తన కెరీర్ లో 27 సినిమాల వరకు చేసి ఉంటారు. ముఖ్యంగా ఓ దశలో పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో అద్భుతమైన స్థాయికి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని ప్లాప్ లను మూట కట్టుకోవాల్సి వచ్చింది. అయితే, అత్తారింటికి దారేది సినిమాతో ప్రజలను తికమక పెట్టేసాడు. ఆ సినిమా కలెక్షన్స్ చూసి అద్భుతం అనుకున్నాం. ప్రస్తుతం ఆయన ఇప్పుడు మళ్లీ డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు.

    Also Read: Superstar Krishna: మహేష్ కాకుండా కృష్ణ గారికి నేటి తరం స్టార్ హీరోలలో ఫేవరెట్ ఎవరో తెలుసా?

    అయితే, ఎప్పుడైనా సినిమా వేరు, రాజకీయం వేరు. కానీ ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే.. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సినిమా వాళ్ళు రాజకీయంలోకి వచ్చి రాణించారు. కాకపోతే, ఒక పార్టీ పెట్టి నిలబడటం వేరు.. ఒకసారి పార్లమెంటుకు వెళ్లి వద్దాం అనుకోవడం వేరు. సమాజాన్ని తన దృక్పథం తో మార్చాలని ఆశయం ఉన్నవాడే నాయకుడు. ఈ ఆశయం పవన్ కళ్యాణ్ కి ఉంది. తనతో ఎవరు వచ్చినా రాకపోయినా తన పోరాటం తను చేసుకుంటూ పోయే వాడే వీరుడు.

    Pawan Kalyan- Paruchuri Gopalakrishna

    పవన్ 2019లో ఎన్నికల్లో తనకంటూ ఆస్తిత్వాన్ని నిరూపించుకుందాం అని ఆ ఎన్నికల బరిలోకి దిగాడు. కానీ, ఈ సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని 2024 ఎన్నికల కోసం బరిలోకి దిగబోతున్నాడు. అయితే, పవన్ ఒక పని చేయాలి. గతంలో ఎన్టీఆర్ గారు, కృష్ణ అధికారంలోకి రావడానికి బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, ఈనాడు వంటి సినిమాలు ఎంచుకొని ప్రజలలో నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా అలా ఒక అద్భుతమైన చిత్రాన్ని ఎంచుకోవాలి. ఆ సినిమాని ప్రజల్లోకి బాగా వెళ్లే విధంగా చేయాలి. ఓటర్లు ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు. వాళ్లకు కొన్ని ఆశయాలు, ఆశలు ఉంటాయి. వాటిని ఎవరు నెరవేరుస్తారో వారి వైపే ఓటర్లు నిలబడతారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు చట్టసభల్లోకి వెళ్లాలని ఆశీర్వదిస్తున్నాను. నిజంగా సీఎం అవుతారని ఆకాంక్షిస్తున్నాను’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పరుచూరి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Also Read:Bigg Boss Telugu 6: అమ్మ బాబోయ్… ఆ లేడీ కంటెస్టెంట్స్ ని చూసి జడుసుకుంటున్న ప్రేక్షకులు… ప్లీజ్ మేకప్ వేయండయ్యా!

    Tags