Hero Tarun : తరుణ్ అభిమానులకు సూపర్ అప్డేట్..

మరి ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారో? ఎలాంటి పాత్రలు చేస్తారో చూడాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Written By: NARESH, Updated On : May 18, 2024 10:14 pm

Super update for hero Tarun fans

Follow us on

Hero Tarun : టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించారు ఈ టాలీవుడ్ హీరో. కానీ కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు తరుణ్. మొత్తానికి కనిపించకుండా పోయిన తరుణ్ పెళ్లి వార్తలు మాత్రం వచ్చాయి. కానీ ఈ విషయాల మీద క్లారిటీ ఇవ్వలేదు.

రీసెంట్ గా తరుణ్ తల్లి రమణి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మరో విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. అదేంటి అంటే.. త్వరలోనే తరుణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించిన ఆలోచనల్లో పడ్డారట తరుణ్. మరి ఎలాంటి స్టోరీ, స్టేటస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి. కానీ కచ్చితంగా తరుణ్ బిగ్ బాస్ లో ఎంట్రీ కూడా ఇస్తారు కావచ్చు అనే మరో ప్రచారం కూడా జరుగుతుంది.

యాక్టర్ తరుణ్ సినిమాలకు దూరం అయిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు అనే క్యూరియాసిటీ చాలా మందిలో నెలకొంది. దానికి రీసెంట్ గా తరుణ్ తల్లి రోజా రమణి స్పందిస్తూ వారికి వ్యాపారాలు ఉన్నాయని.. రియల్ ఎస్టేట్ తో పాటు బిజినెస్ లు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులు తరుణ్ వాటినే చూసుకున్నారట. కానీ సినిమాల్లోకీ రీ ఎంట్రీ మాత్రం పక్కా అంటున్నారు.

సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండబోతున్నారట. ఏది పడితే అదే క్యారెక్టర్ చేస్తే ఫేమ్ రాదని.. వాటి వల్ల హిట్ లు కూడా రావని అనుకుంటున్నారు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోబోతున్నారట తరుణ్. మరి ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారో? ఎలాంటి పాత్రలు చేస్తారో చూడాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.