FURIOSA : A MAD MAX SAGA : ఏం విజువల్స్ స్వామి.. నరాల్ కట్ అయిపోయినయ్.. రిలీజ్ మ్యాడ్ మాక్స్ సిరీస్ ప్రీక్వెల్ రెడీ…

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచేస్తుంది. ఇక 1400 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది...

Written By: NARESH, Updated On : May 18, 2024 10:08 pm
Follow us on

FURIOSA : A MAD MAX SAGA : హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇక ముఖ్యంగా ఓటిటి లో అయితే వరుస సీరీస్ లు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లు అంటే భారీ యాక్షన్ హంగులతో, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకున్నాయి.

అందులో భాగంగానే ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ ప్రీక్వెల్ గా ‘ప్యూరియోసా ఏ మ్యాడ్ మాక్స్ సాగ పేరుతో ఒక సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా దాదాపు 1400 కోట్లతో తెరకెక్కింది. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతేతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా లో క్రిస్ హెమ్ వర్త్, అన్న టేలర్ జాయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కి ‘జార్జ్ మిల్లర్’ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి 20 ఏళ్లు ముందు ఏం జరిగింది అనే పాయింట్ ను బేస్ చేసుకొని ఈ సీరీస్ ను తెరకెక్కించారు. ఇక ఫ్యూరీయోసా, డిమెంటస్ అనే ఇద్దరు బైకర్లు సాగించిన పోరాటం నేపథ్యంలో లో ఈ సీరీస్ సాగనున్నట్టుగా తెలుస్తుంది.. ఇక ఈ సినిమా తో మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మే 24 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన మ్యాడ్ మాక్స్ అన్ని సీరీస్ లకి కలిపి ఆరు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇక ఈ సిరీస్ తో మరొక ఆస్కార్ అవార్డు కూడా వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచేస్తుంది. ఇక 1400 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…