Homeఎంటర్టైన్మెంట్Sunil : సునీల్ కి లైఫ్ చేంజ్ ఆఫర్.. ఫామ్ లోకి వస్తాడా ?

Sunil : సునీల్ కి లైఫ్ చేంజ్ ఆఫర్.. ఫామ్ లోకి వస్తాడా ?

Sunil: Life Change Offer To Sunil Will He Get Into The Form

Sunil:  హీరో అనిపించుకోవడానికి సునీల్ (Sunil) చాలా కష్టపడ్డాడు. అంతకు మించి చాలా రిస్క్ చేశాడు. ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. కానీ, హీరోగా నలిగిపోయాడు, చేసిన ప్రతి సినిమాకి పోస్టర్ల డబ్బులు కూడా రాలేదు, ఎన్నో అవమానాలు అనంతరం చివరకు కామెడీ క్యారెక్టర్స్ కూడా రాక గత కొన్ని సినిమాలుగా బాగా ఇబ్బంది పడుతున్నాడు.

కానీ, ఈ సారి సునీల్ కి బంఫర్ ఆఫర్ తగిలింది. ఒక విధంగా ఈ ఆఫర్ లైఫ్ చేంజ్ ఆఫరే అనుకోవాలి. ఎందుకంటే ఇది క్రేజీ పాన్ ఇండియా సినిమా. పైగా ఈ సినిమాలో సునీల్ ది కీలకపాత్ర. మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’తో విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ప్లాన్ చేసిన సినిమాలో ఒక కీలక పాత్రలో సునీల్ నటించనున్నాడు.

హీరో తర్వాత పాత్రల స్థాయిలో సమాంతరంగా సునీల్ పాత్ర ఉంటుందట. మొదట ఆ పాత్రలో ఓ తమిళ యంగ్ హీరోను తీసుకోవాలనుకున్నా.. చరణ్ సపోర్ట్ తో సునీల్ ను ఫైనల్ చేశారు. మరీ ఈ సినిమా సునీల్ ను మళ్ళీ ఫామ్ లోకి తెస్తుందేమో చూడాలి. ప్రస్తుతం విలన్ గా క్యారక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా మళ్ళీ ఫామ్ లో రావడానికి నానా కష్టాలు పడుతున్నాడు.

ఈ క్రమంలోనే ‘కలర్ ఫోటో’ సినిమా చేశాడు. ఆ చిత్రంలో సునీల్ పోషించిన విలన్ పాత్రకు పర్వాలేదు అనే పేరు వచ్చింది. సునీల్ కి విలన్ పాత్రలు సెట్ అవ్వకపోయినా, సైడ్ విలన్ పాత్రలకు పనికొస్తాడు అనే నమ్మకం కలిగింది మేకర్స్ కి. మొత్తానికి అటు విలనీజంను ప్రదర్శిస్తూనే ఇటు కామెడీని పండించే పాత్రలు చేయాలని సునీల్ ఆశ పడుతున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular