https://oktelugu.com/

అటు విలనీజం ఇటు హాస్యం మధ్యలో సునీల్ !

హీరో వేషాలు వేయడానికి, వచ్చిన అవకాశాలను వదులుకుని కొన్నాళ్ళు పాటు పాటలు ఫైట్స్ గట్రా పాడుకుంటూ మొత్తానికి తానూ కూడా హీరోనే అనిపించుకోవడానికి ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు సునీల్. కానీ, హీరోగా నలిగిపోయాడు, చేసిన ప్రతి సినిమాకి పోస్టర్ల డబ్బులు కూడా రాలేదు. దాంతో హీరో అనే ట్యాగ్ లైన్ ను పక్కన పెట్టి, విలన్ గా క్యారక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా మళ్ళీ ఫామ్ లో రావడానికి నానా కష్టాలు పడుతున్నాడు. […]

Written By:
  • admin
  • , Updated On : July 2, 2021 / 07:38 PM IST
    Follow us on

    హీరో వేషాలు వేయడానికి, వచ్చిన అవకాశాలను వదులుకుని కొన్నాళ్ళు పాటు పాటలు ఫైట్స్ గట్రా పాడుకుంటూ మొత్తానికి తానూ కూడా హీరోనే అనిపించుకోవడానికి ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు సునీల్. కానీ, హీరోగా నలిగిపోయాడు, చేసిన ప్రతి సినిమాకి పోస్టర్ల డబ్బులు కూడా రాలేదు. దాంతో హీరో అనే ట్యాగ్ లైన్ ను పక్కన పెట్టి, విలన్ గా క్యారక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా మళ్ళీ ఫామ్ లో రావడానికి నానా కష్టాలు పడుతున్నాడు.

    ఈ క్రమంలో ‘కలర్ ఫోటో’లో సునీల్ పోషించిన విలన్ పాత్రకు పర్వాలేదు అనే పేరు వచ్చింది. సునీల్ కి విలన్ పాత్రలు సెట్ అవ్వకపోయినా, సైడ్ విలన్ పాత్రలకు పనికొస్తాడు అనే నమ్మకం కలిగింది మేకర్స్ కి. అందుకే అనిల్ రావిపూడి తీస్తున్న క్రేజీ సీక్వెల్ ‘ఎఫ్ 3’లో చాలా పెద్ద పాత్రనే ఇచ్చారు సునీల్ కి. విలన్ పాత్రకు అసిస్టెంట్ పాత్రలో సునీల్ నటించబోతున్నాడు.

    అటు విలనీజంను ప్రదర్శిస్తూనే ఇటు కామెడీని పండించే పాత్ర అది. మొత్తానికి ఈ పాత్రతో సునీల్ కెరీర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తోంది అంటున్నారు ఎఫ్ 3 చిత్రబృందం. ‘ఎఫ్ 2’లో నటించిన వెంకటేష్, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్… ఇలా మెయిన్ నటినటులందరూ ‘ఎఫ్ 3’లోనూ రిపీట్ అవుతున్నారు. వీరికి తోడు ఇప్పుడు స్పెషల్ కామెడీతో సునీల్ పాత్ర కూడా యాడ్ అవ్వబోతుంది.

    అన్నట్టు కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో లాంగ్ షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో వెంకటేష్ , వరుణ్‌తేజ్‌, సునీల్‌ సహా ప్రధాన తారల పై కొన్ని కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు. సెట్స్‌ లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో షూట్ చేస్తున్నారు. డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.