Actor Sunil: కమెడియన్ పాత్రలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు భీమవరం బుల్లోడు సునీల్. కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉండే సునీల్ కి అందాల రాముడు చిత్రంలో హీరోగా నటించి ఆ చిత్రంతో హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “మర్యాద రామన్న” చిత్రంతో హీరోగా కెరీర్ ను కంటిన్యూ చేయగా ఆ తర్వాత విడుదలైన చిత్రాలు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా సినిమాలు చేశాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో సునీల్ కొన్ని డైలాగ్స్ చెబుతూ కనిపించారు. ఆయన గెటప్, చిత్తూరు యాసలో మాట్లాడిన తీరు అతడి పాత్రపై ఆసక్తిని పెంచేలా చేసింది. ఈ పాత్రతో సునీల్ సినీ ప్రయాణానికి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా సునీల్ పెర్ఫార్మన్స్ చూసి ఆశ్చర్యపోయారట. ఇటీవల తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన బన్నీకి అప్పటికే డబ్బింగ్ పూర్తి చేసిన సునీల్ కి సంబంధించి కొన్ని సీన్లు చూశారట అందులో సునీల్ పెర్ఫార్మన్స్ కి బన్నీ ఫిదా అయిపోయారట. చూడాలి మరి సునీల్ పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించనుందొ మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. త్వరలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు మేకర్స్ .