Pushpa aarya3 : కరోనా కల్లోలంతా వాయిదాలు పడుతున్న ‘పుష్ప’ మూవీని ఈ డిసెంబర్ నెలాఖరులో ఎలాగైనా రిలీజ్ చేయాలని దర్శకుడు సుకుమార్ అండ్ టీం పట్టుదలగా ఉంది. ఇప్పటికే క్రిస్టమస్ కు తేదీని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి ‘ఆచార్య’ కోసం ‘పుష్ప’ను వాయిదా వేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఆ ఊహాగానాలన్నీ కొట్టివేస్తూ ‘పుష్ప’ను డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేయనున్నట్టు తాజాగా దర్శకుడు సుకుమార్ ప్రకటించారు.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో దర్శకుడు సుకుమార్ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. డిసెంబర్ 17న పుష్ప మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కమెడియన్ సునీల్ ‘పుష్ప1’లో మెయిన్ విలన్ అని ప్రకటించడం సంచలనమైంది.
ఇక సుకుమార్ ప్రతీ సినిమాలోనూ ఒక ఐటెం గర్ల్ ఉంటుంది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ లోనూ ఒక మాంచి ఊర మాస్ ఐటెం సాంగ్ ఉందని.. దానికి ఒక ఉత్తర భారతదేశానికి చెందిన గర్ల్ చేయబోతోందని రివీల్ చేశఆరు.
ఇక ఇన్నాళ్లు పుష్ప మూవీకి విలన్ అనుకుంటున్న మలయాళ నటుడు ఫవాద్ నిజానికి ఈ సినిమా పార్ట్ 1 క్లైమాక్స్ లో కనిపిస్తాడని.. అతడు సెకండ్ పార్ట్ కు విలన్ అని తెలిసింది.
ఇక అల్లు అర్జున్ తో కలిసి తాను ‘ఆర్య3’ ఖచ్చితంగా తీస్తానని.. దానికి దేవీశ్రీప్రసాద్ యే సంగీతం అందిస్తాడని సుకుమార్ పలు ఆసక్తికర విషయాలను ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పంచుకున్నాడు.