Sundarakanda movie review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కొత్త కథలను సినిమాలుగా ఎంచుకొని సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాల్ని ఎంచుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు… ఇక కెరియర్ స్టార్టింగ్ లో సోలో సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు నారా రోహిత్… ఇక మూవీ తర్వాత రౌడీ ఫెలో, అసుర లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మరి ఆ తర్వాత ఆయన చాలా సంవత్సరాల నుంచి సినిమాలు చేయకుండా ఇండస్ట్రీకి కొద్దిగా బ్రేక్ అయితే ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆయన సుందరకాండ అంటూ ఒక లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే 30 సంవత్సరాలు నిండిన కూడా పెళ్లి కానీ సిద్ధార్థ్ (నారా రోహిత్) తనకి నచ్చిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ముఖ్యంగా తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఒక ఐదు క్వాలిటీస్ ఉండాలని అనుకుంటాడు. ఆయన పెట్టుకున్న ఐదు క్వాలిటీస్ ఏంటి ఆ క్వాలిటీస్ మ్యాచ్ చేసే అమ్మాయి దొరికిందా? లేదా ఈ పెళ్లి ప్రాసెస్ లో ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాని చివరి వరకు ఎంగేజింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ లో డైలాగులు బాగా రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది. సెకండాఫ్ లో వచ్చే సీమంతం ఎపిసోడ్లో సత్య చాప మంచి కామెడీ చేశాడనే చెప్పాలి. ఇక సత్యం కోసం ఏర్పాటు చేసుకున్న కామెడీ ట్రాక్ మొత్తం చాలా బాగా సెట్ అయింది. మొత్తానికైతే ఈ కంప్లీట్ ట్రాక్ ని చాలా అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక లవ్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు…
నారా రోహిత్ సైతం చాలా చక్కటి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ముఖ్యంగా 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే సీన్స్ లో ఆయన నటన అద్భుతంగా ఉంది… ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్ గా సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమాలో ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులకు బాగా ఇంపాక్ట్ ను కలిగించాయి. సినిమాలో ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఎమోషన్ కలిగించే సన్నివేశాలను రాసుకొని సినిమా నెక్స్ట్ లెవెల్లో తీశాడు.
దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి మొదటి సినిమా అయినా బాగా తీశాడు. ఈ సినిమా ఫీల్ గుడ్ అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతోంది.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే నారా రోహిత్ చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. తనతో పాటుగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శ్రీదేవి సైతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆమె కూడా చాలా మంచి నటనను కనబరిచి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది… వీరిటి వాగని మరో హీరోయిన్ గా చేసింది. తను సైతం చాలా మంచి పర్ఫామెన్స్ ని అందించింది. సీనియర్ నరేష్ సైతం తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. కమెడియన్ సత్య మొదటి నుంచి చివరి వరకు నవ్వులు పూయిస్తూనే ఉన్నాడు. స్క్రీన్ మీద అతను కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారంటే ఆయన కామెడీ ఎంతలా పేలిందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే లియో జేమ్స్ అందించిన మ్యూజిక్ బాగుంది. బ్యా గ్రౌండ్ స్కోర్ ఓవరాల్ గా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా చాలా మంచి విజువల్స్ అయితే ప్రేక్షకుడిగా అందించే ప్రయత్నం చేశారు… ఎడిటింగ్ విషయం లో చాలా బాగా సినిమాను కట్ చేశారు.. సినిమా గ్రిప్పింగ్ గా వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ సైతం బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
నారా రోహిత్ యాక్టింగ్
సత్య కామెడీ
సెకండాఫ్
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 3/5