Malli Modalaindi: సుమంత్, నైనా గంగూలీ, యాంకర్ వర్షిణి సౌందర రాజన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మళ్ళీ మొదలైంది’. ఈ సినిమాకు కార్తీక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజా ఈ మూవీ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సినిమాలో పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఓ భర్త తన (మాజీ) భార్య తరఫున తరఫున వాదించిన లాయర్‌తో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అలానే నికోల్ కిడ్ మన్ – టామ్ క్రూజ్, బిల్ గేట్స్ – మిళిందా గేట్స్, బ్రాడ్ పిట్ – ఏంజలీనా జోలీ… ఇలా విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలను చూపించడం ద్వారా తమ కాన్సెప్ట్ ఏంటో చెప్పారు మూవీ టీమ్. కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ముగిస్తే… కొన్ని పెళ్లిళ్లు విడాకులతో మొదలవుతాయని ముందే వివరించారు. భార్యను చులకనగా చూడకూడదని సినిమాలో చివర్లో సందేశం కూడా ఇచ్చినట్టు ఉన్నారు.
#MalliModalaindi… looks like a refreshing take on life and relationships! Best wishes to @iSumanth and the entire team! https://t.co/I7oDhUKNUm@tgkeerthikumar @NainaGtweets@anuprubens @tejuppalapati
— Mahesh Babu (@urstrulyMahesh) October 28, 2021
మళ్లీ ప్రేమలో పడటం అంటే ఏదో సీరియస్ ఇష్యూలా కాకుండా వినోదాత్మకంగా చెప్పారు. ‘శారదమ్మగారి మనవడికి విడాకులు అయిపోయిందంటమ్మా… ఇంకా చూస్తూ నేను ఎలా బతుకుండేదామ్మా అంటూ బామ్మ వయసున్న మహిళలు ఏడుస్తుంటే… ‘అయితే చచ్చిపోండి’ అని సుమంత్ అనడంతో బామ్మలు నోరెళ్లబెట్టారు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా దొంగ సచ్చినోడా అని సొంత మనవడిని అన్నపూర్ణమ్మ తిట్టడం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా న్యాయమూర్తి పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీ మంచి వినోదం పండించినట్టు ఉన్నారు. ట్రైలర్ ఎండింగ్ లో ‘నిను వీడని నీడను నేనే’ అంటూ పృథ్వీ చెప్పిన డైలాగ్ బావుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sumanth malli modalaindi movie trailer released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com