Homeఎంటర్టైన్మెంట్Suma Kanakala Cousin: యాంకర్ సుమ కజిన్ కూడా టాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఎవరో...

Suma Kanakala Cousin: యాంకర్ సుమ కజిన్ కూడా టాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఎవరో చెప్పగలరా..

Suma Kanakala Cousin: బుల్లితెర రంగం లో దశాబ్దాల నుండి స్టార్ యాంకర్ గా కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న మహిళా సుమ(Suma Kanakaala). యాంకరింగ్ రంగం లోకి అడుగుపెట్టాలనుకునే ప్రతీ మహిళకు ఆమె ఒక రోల్ మోడల్ లాంటిది. ప్రతీ ఏడాది కొత్తగా ఎంతో మంది యాంకర్లు ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ , సుమ స్థానాన్ని రీ ప్లేస్ చేయలేకపోతున్నారు. చిన్న హీరోల దగ్గర నుండి , పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు , ప్రతీ ఒక్కరికి సుమ నే కావాలి. ఇంత బిజీ గా ఏ స్టార్ యాంకర్ ఇండియా లో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల ఎంతటి పాపులర్ నటుడో అందరికీ తెలిసిందే. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో ఇతను ఉండాల్సిందే.

కేవలం భర్త మాత్రమే కాదు, సుమ కజిన్ కూడా ఇండస్ట్రీ లో ఒక సీనియర్ నటి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు ఇందు ఆనంద్ . కేరళ ప్రాంతానికి చెందిన ఈమె , బుల్లితెర పై ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. టీవీ సీరియల్స్ లో బాహుబలి స్థాయి విజయం సాధించిన చక్రవాకం , మొగలి రేకులు వంటి సీరియల్స్ లో ఈమె కీలక పాత్ర పోషించింది. ఆర్మీ కుటుంబానికి చెందిన ఈమె , ప్రేమ వివాహం చేసుకొని స్థిరపడింది. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , ప్రముఖ యాంకర్ సుమ తో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సుమ మా తల్లిదండ్రుల ఇరువైపులా బంధువు. ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. కానీ ఇద్దరికీ బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల రెగ్యులర్ గా కలవలేకపోతున్నాం ‘ అంటూ చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి చనిపోయినప్పుడు చాలా దిగ్బ్రాంతికి గురయ్యాను అని, ఆ సమయం లో సుమ కి ఫోన్ చేసి మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సుమ యాంకర్ గా వ్యవహరించిన , బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షో ‘స్టార్ మహిళ ‘ ప్రోగ్రాం లో ఒక ఎపిసోడ్ కి అతిథి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చానని , ఇలాంటి సంఘటనలు మా మధ్య చాలానే జరిగాయని , అవి మర్చిపోలేని జ్ఞాపకాలు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version