https://oktelugu.com/

బన్నీ సినిమా షూటింగ్ పై సుకుమార్ సంచలన నిర్ణయం

కరోనాతో సినీ ఇండస్ర్టీకి చెప్పలేని నష్టం ఏర్పడింది. మొన్నటిదాక షూటింగ్‌లకు పర్మిషన్‌ రాలేదు.. ఇప్పటివరకు ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ఆ పరిశ్రమపై ఆధారపడ్డ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే షూటింగ్‌లకు పర్మిషన్‌ వచ్చినా వేరే రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితులు లేవు. Also Read: కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి దీంతో డైరెక్టర్లు, హీరోలు మన దేశంలోని లోకేషన్లను వెతికే పనిలో పడ్డారు. అయితే టాప్‌ డైరెక్టర్లలో ఒక్కరైన సుకుమార్‌‌ మాత్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 / 10:11 AM IST
    Follow us on

    కరోనాతో సినీ ఇండస్ర్టీకి చెప్పలేని నష్టం ఏర్పడింది. మొన్నటిదాక షూటింగ్‌లకు పర్మిషన్‌ రాలేదు.. ఇప్పటివరకు ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ఆ పరిశ్రమపై ఆధారపడ్డ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే షూటింగ్‌లకు పర్మిషన్‌ వచ్చినా వేరే రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితులు లేవు.

    Also Read: కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి

    దీంతో డైరెక్టర్లు, హీరోలు మన దేశంలోని లోకేషన్లను వెతికే పనిలో పడ్డారు. అయితే టాప్‌ డైరెక్టర్లలో ఒక్కరైన సుకుమార్‌‌ మాత్రం తాను అనుకున్న లొకెషన్లలోనే సినిమా తీయాలని అనుకుంటున్నారట. స్టార్‌‌ హీరో అల్లు అర్జున్‌తో ప్రస్తుతం సుకుమార్‌‌ పుష్ప సినిమా తీస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌ కేరళలోని అటవీ ప్రాంతంలో షూట్‌ చేయాలని గతంలో నిర్ణయించారు.

    కరోనా పరిస్థితుల దృష్ట్యా అక్కడికి పరిస్థితి లేకపోవడంతో తెలంగాణలోని వికారాబాద్‌ లేదా ఆంధ్ర రంపచోడవరం అడవులతో సరిపెట్టాలని అనుకున్నారు. కానీ.. అలా ఎందుకు, మళ్లీ కేరళకే వెళ్తాము అన్నది సుకుమార్ పాయింట్ అట. కరోనాకు ముందు రెక్కీచేసి, అంతా ప్లాన్ చేసింది కేరళ నేపథ్యంలోనే. పైగా ఆ బ్యాక్ డ్రాప్ తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా ఉండే అవకాశం ఉంది. అదీ కాక బన్నీకి వున్న మలయాళీ ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహంగా ఉంటుంది. అందుకే అన్ని విధాలా కేరళలో షూట్ చేయడానికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూలింగ్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

    Also Read: రాంచరణ్ నయా లుక్.. ‘అల్లూరి’లా ఒదిగిపోయాడు..!

    మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా సమ్మర్ విడుదల టార్గెట్‌గా పెట్టుకుంది. ఏప్రిల్‌లో మెగాస్టార్ ఆచార్య విడుదల ప్లాన్ చేస్తున్నారు. మే లేదా జూన్‌కు పుష్ప రెడీ కావాల్సి ఉంటుంది. ఈ సినిమా కోసం బన్నీ డిఫరెంట్ మేకోవర్‌‌తో రెడీ అయి ఉన్నారు.