Sukumar: సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ లాంటి దర్శకుడు సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా మీద భారీ అంచనాలు పెంచుకుంటారు అభిమానులు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చాలా వరకు హిట్ లను సొంతం చేసుకున్నాయి. ఆయన సినిమాలు మంచి ఎమోషన్ తో కూడి ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో వచ్చి మరీ థియేటర్లలో నిండిపోతుంటారు ప్రేక్షకులు. ఇక ఈయన హిట్ లలో భాగంగా ఈ డైరెక్టర్ రైటర్స్ టీం నుంచి ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ ను కూడా సుకుమార్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట. ఇటు సుకుమార్, అటు దిల్ రాజు ఇద్దరు కలిసి ఈ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్దమయ్యారని టాక్. ఈయన పేరు వివరాలు బయటపెట్టకపోయినా ఆయన సుకుమార్ టీం లో నుంచి రాబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ చేశారట. ఇదిలా ఉంటే ఇప్పటికే సుకుమార్ తన శిష్యులను డైరెక్టర్లను చేసే బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రైటర్ ను కూడా పరిచయం చేయబోతున్నారట.
ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న వారిలో ప్రతిభ ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది దర్శకులుగా మంచి గుర్తింపును సంపాదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరికొందరు కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో ఈయన శిష్యులే ఉండాలని చూస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి ముంబై నుంచి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారట.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ సాధించిన సుకుమార్ పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ ను తీసుకురావడానికి సిద్దమయ్యారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కు రెడీ అయింది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.