Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన విజయం ఒకెత్తయితే ఇక మీదట నుంచి ఈ సినిమా పెను రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం మరొక ఎత్తనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ పుష్ప 2 సినిమాని భారీ ఎలివేషన్స్ తో తీశాడు. దానివల్ల ఈ సినిమాకి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో కూడా నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయంటూ చాలామంది సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ పుష్ప 2 తో పాటు పుష్ప 3 సినిమా కూడా ఉంటుంది అంటూ సినిమా ఎండింగ్ లో ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మరి దానికి తగ్గట్టుగానే పుష్ప 3 సినిమా షూటింగ్ కూడా కొంతవరకు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పుష్ప 3 సినిమా ఇప్పటివరకు షూట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఒక టీజర్ ని వదిలే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని 2027 వ సంవత్సరంలో అఫీషియల్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక అప్పటివరకు ఈ సినిమా మీద ఉన్న హైప్ ని మరింత పెంచడానికి ఇప్పటివరకు షూట్ చేసిన పార్ట్ ని బేస్ చేసుకుని 30 సెకండ్ల నిడివితో ఒక టీజర్ ని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం తో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది… ఒకవేళ ఈ సినిమా నుంచి టీజర్ కనక వచ్చినట్లయితే యావత్తు ప్రేక్షకులందరూ ఉర్రుతలుగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు విషయంలో ఇబ్బందుల్లో ఉన్నాడు. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ని వదలడం లేదు. కేసు విషయం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎన్ని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న సుకుమార్ ఇకమీదట చేయబోయే సినిమాలతో సూపర్ స్టార్ డమ్ ని సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…