Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి… ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. అయితే మొదటి పార్ట్ భారీ రేంజ్ లో సూపర్ సక్సెస్ ని అందుకోవడంతో సెకండ్ పార్ట్ మీద భారీ అంచానాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) మరోసారి పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకొని ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డు ని కూడా గెలుచుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు కూడా దానిమీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ హిట్ ఇవ్వనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
అది ఏంటి అంటే సినిమా మధ్యలో పుష్ప భార్య అయిన రష్మిక మందన చనిపోతుందంట ఇక తను క్లైమాక్స్ లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి ఒక ట్విస్ట్ తో ఈ సినిమాని ఎలివేట్ చేయాలని చూస్తున్నాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే ఆమెను చంపిన వారు ఎవరు మళ్లీ ఆమె ఎలా బతికి వచ్చింది అనేది ట్విస్ట్ గా చూపించి ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…
మరి ఈ సినిమాతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ గా గుర్తింపు పొందుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఈ సినిమాతో కనక సూపర్ హిట్ కొడితే పాన్ ఇండియా లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా కొనసాగుతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…