Homeఎంటర్టైన్మెంట్Sukumar: ఆర్య త్రీ సిరీస్ ఆలోచనలో సుకుమార్ ... హీరో ఎవరో తెలుసా ?

Sukumar: ఆర్య త్రీ సిరీస్ ఆలోచనలో సుకుమార్ … హీరో ఎవరో తెలుసా ?

Sukumar: ఆర్య, ఆర్య2, 100% లవ్, వంటి ప్రేమ కధ చిత్రాలతో టాలీవుడ్ లో… తనకంటూ ఒక గుర్తిపు పొందిన డైరెక్టర్ సుకుమార్. కాగా ప్రస్తుతం పుష్ప సినిమా షెడ్యూల్లో బిజీ గా ఉన్న సుక్కు … పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సంధర్భంగా సుకుమార్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పుష్ప సినిమా విడుదలలో ఎటువంటి మార్పు ఉండదని… డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలియజేశారు. అలానే ఆర్య 3 సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తన మనసులో మాట బయట పెట్టారు.

sukumar-planning-to-make-arya-3

సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేక … పాట ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ పనిక్ చేస్తున్న విషయం తెలిసిందే. సుక్కు – దేవి కాంబో లో వచ్చిన ప్రతి సినిమా పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రంలో కూడా దేవి అద్భుతమైన పాటలు ఇవ్వబోతున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహద్, సునీల్, వెన్నెల కిషోర్, అనసూయ తదితర నటులు నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు కలయికతో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. ఆర్య సిరీస్ ని కొనసాగించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సుకుమార్ తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఆర్య 3 ని చేయనున్నారని … ఇందు కోసం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ ఆలోచన పుష్ప సెట్స్ లోనే వచ్చిందని సుకుమార్… అభిమానులకు వివరించారు. ఈ చిత్రంలో నటీనటుల గురించి ప్రస్తుతానికి ఇంకా ఏం అనుకోలేదని అన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular